అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం? | The highest biodiversity in the country? | Sakshi
Sakshi News home page

అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం?

Published Tue, Jun 24 2014 10:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం? - Sakshi

అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం?

సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆగస్టులో జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలోని రెండు పేపర్లలో జనరల్ స్టడీస్ కీలకమైంది. జనరల్ సైన్‌‌స, పర్యావరణ అంశాల నుంచి దాదాపు 30 ప్రశ్నలు క్రమం తప్పకుండా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తేనే ప్రిలిమినరీలో విజయవకాశాలు మెరుగవుతాయి.
 
 - జనరల్ సైన్‌‌సలో జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమి స్ట్రీ అంశాలు ఉంటాయి. వీటితోపాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై కూడా సమకాలీన దృక్పథంతో ప్రశ్నలు అడుగుతారు. పర్యావరణ విభాగంలో జీవావరణ శాస్త్రం, ఆవరణ శాస్త్ర భావనలు, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం మొదలైన అంశాలు ఉంటాయి. జీవశాస్త్రంలో అభ్యర్థులు వృక్ష జంతు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. జీవ పరిణామ క్రమం, ఏ వర్గం తర్వాత ఏ వర్గం ఆవిర్భవించింది? లాంటి అంశాలను తులనాత్మకంగా  అధ్యయనం చేయాలి.

అదేవిధంగా మానవ శరీరధర్మ శాస్త్రం, వ్యాధులకు అధిక ప్రాధాన్యమిచ్చి  చదవాలి. శరీర అవయవాల పనితీరు, సాధారణంగా వా టికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు వస్తాయి. అల్జీమర్‌‌స, పార్కిన్‌సన్, గుండె, శ్వాసకోశ వ్యాధులు, వివిధ రకాల శస్త్ర చికిత్సలు, ఉపయోగించే ఔషధాలు, నిర్ధారణ పరీక్షలు, టీకాలు లాంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. జీవశాస్త్రంతో ముడిపడిన కరెంట్ అఫైర్‌‌సపై కూడా అభ్యర్థులు దృష్టి సారించాలి. ముఖ్యంగా  శాస్త్రవేత్తలు - వారి పరిశోధనలు, నోబెల్ పురస్కారాలు, Middle East Respira- tory syndrome,  ఇటీవల కాలంలో ప్ర బలుతున్న ఫ్లూ లాంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
 
 - భౌతిక శాస్త్రంలో  అప్లయిడ్ అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. వివిధ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాల పనితీరు, సూత్రాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వివిధ రకాల సరికొత్త (LED, LCD, HD, VHD) టీవీల మధ్య భేదాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌‌స, మెకానిక్స్, భౌతికరాశుల ప్రమాణా లు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి. రసాయన శాస్త్రంలో ప్రశ్నలు క్రమంగా పెరుగుతున్నాయి.

దైనందిన జీవితంలో మనిషి వాడే వివిధ రసాయనాలు (కాస్మొటిక్స్, టాయిలెట్రీస్, ఫార్మాస్యూటికల్స్) అదే విధంగా, ప్లాస్టిక్స్, పాలిమర్‌‌స కంపోజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. లోహ సంగ్రహణ శాస్త్రం పరమాణు నిర్మాణం, మెటలర్జీ, పీరియాడిక్ టేబుల్, డైమండ్, బంగారం, గాజు, రత్నాలు మొదలైన వాటిపై సమాచారాన్ని సేకరించాలి.
 
 - పర్యావరణంలో జీవవైవిధ్యం ఆవరణ శాస్త్ర భావనలు శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యం, అంతరించే ప్రమాదమున్న జీవజాతులపై ప్రశ్నలు క్రమం తప్పకుండా వస్తున్నాయి. జనరల్ స్టడీస్‌లోని అంశాలన్నింటిలో ఈ అంశం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.

ఎకాలజీ టెర్మినాలజీ, జీవుల అనుకూలనాలు (Adaptations), ఎకో సిస్టం, నిర్మాణం, శక్తి ప్రసరణ, బయోజియో కెమికల్ సైకి ల్స్ లాంటి అంశాలు ఆవరణ శాస్త్రంలో ముఖ్యమైనవి. జీవ వైవిధ్యానికి సంబంధించి స్థాయిలు, రకాలు, ప్రమాదాలు, (ప్రస్తుత ఉదాహరణలు) జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లు, పరిరక్షణ పద్ధతులు, సమస్యలు మొదలైన వాటిపై దృష్టి సారించాలి. గత పరీక్షలో దేశంలో రాబందుల సంఖ్య తగ్గడానికి కారణం అడిగారు. పశువుల్లో  డైక్లోఫినాక్ అనే వాపు నివారణ ఔషధాన్ని వినియోగించడం దీనికి కారణం.
 
 - జీవ వైవిధ్యానికి సంబంధించి ప్రస్తుతం వార్తల్లోని వాటిపై దృష్టి సారించాలి. ఉదాహరణకు గతేడాది బట్టమేక పక్షి (Great Indian Bustard)ను క్రిటికల్లి ఎన్‌డేంజర్‌‌డ జాబితాలోకి ఐ్ఖఇూ చేర్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పక్షుల వివరాలు, వాటికి ప్రత్యేకంగా  ఎదురవుతున్న ప్రమాదాలు, దాని శాస్త్రీయ నామం.. ఇలా సమాచారాన్ని సేకరించాలి. ఇదే దృక్పథాన్ని అన్నింటికీ అవలంభించాలి.
 
 - పర్యావరణ కాలుష్యం కూడా ముఖ్యమైన పాఠ్యాంశం. సాధారణంగా వాయు, జల, భౌమ, శబ్ద కాలుష్యంతోపాటు కాంతి కాలుష్యం, రేడియో ధార్మిక కాలుష్యం, ఘన వ్యర్థ పదార్థాలు, రీసైక్లింగ్ విధానాలు, ఎలక్ట్రానిక్ వేస్ట్, బయో మెడికల్ వేస్ట్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని చదవాలి. దీనికి అదనంగా అధికారిక గణాంకాలను కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి సంబంధిం చి అమల్లో ఉన్న అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, కార్యక్రమాల గురించి అభ్య ర్థి తెలుసుకోవాలి.
 
 - జాతీయస్థాయిలో వన్యజీవుల జీవ వైవి ధ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. దేశ జీవ వైవిధ్యం, వాటిలో ఎండమిజంపై అవగాహనను పెంచుకోవాలి. ప్రాజెక్టు టైగర్, క్రోకోడైల్, ప్రాజెక్ట్  ఎలిఫెంట్‌పై శ్రద్ధగా సమాచారాన్ని సేకరించాలి. జాతీయ పార్కులు, అభయారణ్యాలు బయోస్పీయర్ రిజర్‌‌వపై సమాచారాన్ని సేకరించాలి. వాటి మధ్య భేదాలు, దేశంలో ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి, ఏ జీవులను ప్రధానంగా ఎక్కడ సంరక్షిస్తున్నారు అనేది చాలా కీలకం.
 
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    దేశంలో బట్టమేక పక్షుల సంఖ్య క్షీణించడానికి ప్రధాన కారణం?
     1) అధిక వేట  2) పర్యావరణ కాలుష్యం
     3) ఆవాసాల క్షీణత 4) శీతోష్ణస్థితి మార్పు
 
 2.    {పపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్ని ఉపజా తుల పులులు ఉన్నాయి?
     1) 9       2) 6    3) 4     4) 2
 
 3.    దేశ వ్యాప్తంగా పర్యావరణ సమాచారానికి సంబంధించిన ఎన్విరాన్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఉూగఐ)ను ప్రభుత్వం  ఎప్పుడు ప్రారంభించింది?
     1) 1982     2) 1989
     3) 1984    4)  1992
 
 4.    వీటిలో సేక్రెడ్ లేక్‌గా దేన్ని గుర్తించారు?
     1) దాల్ సరస్సు     
     2) కేచియోపాల్రీ సరస్సు
     3) కేబుల్ లేమ్‌జావో సదస్సు 4) అన్నీ
 
 5.    ఏ కీలకమైన న్యూరోట్రాన్స్‌మీటర్ లోపం వల్ల పార్కిన్‌సన్‌‌స వ్యాధి సంభవిస్తుంది?
     1) అసిటైల్ కోలిన్     2) గ్లైసిన్
     3) సెరటోనిన్     4) డోపమైన్
 
 6.    నానో మిషన్ కౌన్సిల్ ఎవరి ఆధ్వర్యంలో అమలవుతోంది?
     1) శ్యాం పిట్రోడా     2) అవినాష్ చందర్
     3) సి.ఎన్.ఆర్.రావు 4) కె. కస్తూరి రంగన్
 
 7.    కిందివాటిలో సరైంది?
     ఎ)    పట్టుపురుగు, బద్దె పురుగులు నిజమైన పురుగులు
      బి)    పక్షుల నుంచి క్షీరదాలు ఆవిర్భవించాయి.
     1) ఎ మాత్రమే    2) బి మాత్రమే
     3) ఎ,బి     4) ఏదీకాదు
 
 8.    గగనతలం నుంచి గగన తలంలోకి ప్రయోగించగల క్షిపణి?
     1) బ్రహ్మోస్     2) ఆకాశ్          3) నిర్భయ్     4) అస్త్ర
 
 9.    అణు రియాక్టర్ల నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతాలు, రాష్ట్రాలను జతపరచండి.
         ప్రాంతం    రాష్ర్టం
     ఎ) మితవర్ది    1) మధ్యప్రదేశ్
     బి) చుట్కా    2) గుజరాత్
     సి) గోరఖ్‌పూర్    3) పశ్చిమ బెంగాల్
     డి) హరిపూర్    4) హర్యానా
         ఎ     బి    సి    డి
     1)    3    4    2    1
     2)    2    1    4    3
     3)    2    1    3    4
     4)    1    2    3    4
 
 10.    సక్యులెంట్ కరూ అనే బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ ఏ ఖండంలోనిది?
     1) ఉత్తర అమెరికా     2) దక్షిణ అమెరికా
     3) ఆఫ్రికా     4) ఆస్ట్రేలియా
 
 11.    {పపంచంలోని మొదటి 17 మెగా బయోడై  వర్సిటీ కేంద్రాల్లో భారత స్థానం?
     1) 1       2) 6     3) 10      4) 17
 
 12.    కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్‌‌వ ఏ రాష్ర్టంలో ఉంది?
     1) ఉత్తరాఖండ్           
     2) ఉత్తరప్రదేశ్
     3) హిమాచల్ ప్రదేశ్
      4) జమ్మూ అండ్ కాశ్మీర్
 
 13.    బెరిల్  ఖనిజంలోకి కొద్దిగా క్రోమియం ఆక్సైడ్ మలినంగా చేరడం ద్వారా ఏర్పడే రంగు రత్నం?
     1) టోపాజ్     2) ఎమిరాల్డ్
     3) రూబీ     4) సాఫెర్
 
 14.    అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం?
     1) ఆస్ట్రేలియా     2) అమెరికా
     3) రష్యా     4) దక్షిణ ఆఫ్రికా
 
 15.    జతపరచండి.
     
     బయోడైవర్సిటీ హాట్‌స్పాట్     ఖండం
     ఎ. సెర్రాడో                     1. యూరప్
     బి. సుందాల్యాండ్               2. ఆఫ్రికా
     సి.మపుటోల్యాండ్                3. ఆసియా
     పోండోల్యాండ్ ఆల్చని    పసిఫిక్
     డి. కాకాసస్               4. దక్షిణ
                           అమెరికా
          ఎ     బి    సి    డి
     1)    1    2    3    4
     2)    4    3    2    1
     3)    3    4    1    2
     4)    3    4    1    2
 
 16. కిందివాటిలో అత్యధిక ఐసోటోపులు ఉన్న మూలకం?
     1) రాగి      2) భాస్వరం
     3) తగరం     4) మాంగనీస్
 
 17.    కిందివాటిలో సరైంది?
     ఎ) భారతదేశ మొట్టమొదటి సైనిక
         ఉపగ్రహం జీశాట్ - 7
      బి) జీశాట్-7ను భారత నౌకాదళం
         {పత్యేకంగా ఉపయోగిస్తుంది
     1) ఎ మాత్రమే    2) బి మాత్రమే
     3) రెండూ    4) ఏదీకాదు     
 
 18.    ఏ నౌకలో తొలిసారిగా దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించారు?
     1) జీఎస్‌ఎల్‌వీ-డి3     
     2) జీఎస్‌ఎల్‌వీ-డి5
     3) జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 06      4) ఏదీకాదు
 
 19.    కిందివాటిలో విచ్ఛిత్తి చెందనిది?
     1) యురేనియం - 238
     2) ఫ్లూటోనియం - 239
     3) యురేనియం - 235
      4) యురేనియం - 233
 
 20.    దేశంలో అపారంగా ఉన్న థోరియం నిల్వలను వినియోగించేందుకు వీలుగా అభివృద్ధి చేస్తున్న అణు రియాక్టర్?
     1) ప్రెషరైజ్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్
     2) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
      3) అడ్వాన్‌‌సడ్ హెవీ వాటర్ రియాక్టర్     4) లైట్ వాటర్ రియాక్టర్
 
 21.    దేశంలో ఏనుగుల రిజర్వులు ఎన్ని ఉన్నాయి?
     1) 28   2) 32    3) 50     4) 80
 
 22. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించిన లోథియన్ ద్వీపం ఏ రాష్ర్టంలో ఉంది?
     1) ఆంధ్రప్రదేశ్       2) ఒడిశా
     3) పశ్చిమ బెంగాల్      4) తమిళనాడు
 
 23.    ఆలివ్ రిడ్లీ టర్టల్ అనే సముద్ర తాబేలుకు చెందిన అతిపెద్ద ప్రజనన ప్రాంతం దేశంలోని ఏ రాష్ర్ట తీరాన ఉంది?
     1) ఒడిశా     2) కేరళ
     3) తమిళనాడు     4) మహారాష్ర్ట
 
 24.    ఏనుగుల జనాభా అత్యధికంగా ఏ రాష్ర్టం లో ఉంది?
     1) అసోం       2) కేరళ  
     3) కర్ణాటక     4) తమిళనాడు
 
 25.    అసోంలో చిరాంగ్-రిపు రిజర్‌‌వను ఏ జంతువుల సంరక్షణ కోసం  ఏర్పాటు చేశారు?
     1) ఒంటికొమ్ము ఖడ్గ మృగం
      2) ఏనుగు
     3) హార్‌‌నబిల్     4) ఏదీకాదు
 
 సమాధానాలు
 1) 3;    2) 2;    3) 1;    4) 2;    5) 4;
 6) 3;    7) 4;    8) 4;    9) 2;    10) 3;
 11) 2;    12) 3;    13) 2;    14) 1;    15) 2;
 16) 3;    17) 3;    18) 2;    19) 1;    20) 3;
 21) 2;    22) 3;    23) 1;    24) 2;    25) 2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement