రెండవ విలువ.. విశ్వసనీయత | The value of the second .. Reliability | Sakshi
Sakshi News home page

రెండవ విలువ.. విశ్వసనీయత

Published Sat, Sep 19 2015 12:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

రెండవ విలువ.. విశ్వసనీయత - Sakshi

రెండవ విలువ.. విశ్వసనీయత

విద్య - విలువలు
సైంటిఫిక్ డెవలపెప్‌మెంట్‌ని మీరు ఆపలేరు. టెలివిజన్ ఉంది. ఇప్పుడు వందల ఛానెళ్లు ఉన్నాయి. మిమ్మల్ని ఉదేకపరచేవి, మీ జీవితాన్ని తప్పుతోవ పట్టించేవి ఎన్నో ఉన్నాయి. మీ సెల్ ఫోన్‌కు మిమ్మల్ని తప్పుతోవ పట్టించే మెసేజీలెన్నో వస్తాయి.
 పుస్తకాలు, మేగజైన్లలో రంగురంగుల బొమ్మలతో చెడువైపు మిమ్మల్ని ఆకర్షించేవెన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆపగలరా? ఇది విమర్శకాదు. మీకు యథార్థం తెలియజెప్పడం. మీ మేనమామగా, పినతండ్రిగా చెప్తున్నా. మీ భద్రత కోరి చెప్తున్నా.

వీటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మార్గం ఒక్కటే. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రిస్ట్రెయింట్. టెలివిజన్, సెల్‌ఫోన్, పత్రిక, పుస్తకాలలో మంచి అందించేవీ ఉంటాయి.
 రామకోటి రాస్తూ హత్యలు చేసేవారు ఉంటారు. రామాయణం రాసి తరించిన వాల్మీకీ ఉన్నాడు. తప్పు రామనామానిదా? అది అర్థం కాని వెర్రితనంలో ఉన్నవాళ్లదా? సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనమైపోవడమన్నది సహజం.
 
ఇప్పుడు సమాజంలో వచ్చిన ప్రమాదకరమైన పోకడ ఏమిటంటే అందించే వాళ్లకు కూడా సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేకపోవడం. ఒకప్పుడు మనం ఇటువంటివి అందించకూడదు, సమాజాన్ని ఇంతలా పాడుచేయకూడదు అన్న బాధ్యత పెద్ద వాళ్లలో ఉండేది. ఇవాళ రోడ్డు మీదికి వెళ్లి చూడండి. భయంకరమైన వాల్ పోస్టర్లు. అవి చూస్తూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నారు. అట్లా చేయకూడదు. చేస్తే మనల్ని చూసి పిల్లలు ఇదే నేర్చుకుంటారు అన్న జ్ఞానం ఆ పెద్దమనిషికి లేకపోతే ఎట్లా?
 
ఇప్పుడు ఏ ఛానల్ ఏం ప్రసారం చేయాలి? ఏ పత్రిక ఎలా వార్త రిపోర్‌‌ట చేయాలి అన్న నియంత్రణ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నియంత్రిస్తే అది స్వేచ్ఛకు భంగకరం. ఎమోషన్ వాళ్ల వ్యాపారానికి ప్రధానాంశం. ఏది తక్కువ సమయంలో ఎక్కువమంది దృష్టిని ఆకర్షించగలదో అది వాళ్లకి గొప్ప అడ్వర్టయిజ్‌మెంట్.
 
మీ మాటల్లో క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే
ఆ మాటలకు ఏమీ విలువ ఉండదు. మీ జీవితానికి విలువుండదు. మీరు ఏమి మాట్లాడుతున్నా, మీరు ఏది  చేస్తున్నా మీరు చేసే పనిలో క్లారిటీ ఉండాలి. యస్ నేనిది ఇందుకు చేస్తున్నా. నేనిది ఇందుకు చదువుకుంటున్నా అని చెప్పగలగాలి. నేనిది చేస్తా అని నమ్మకం ఉండాలి. నేనిది సాధిస్తా అన్న విశ్వాసం ఉండాలి.
 
అందుకని మీ ఎమోషన్ని ఎవరినీ దోపిడీ చేయనీయకండి. మీరు సెల్ఫ్ రిస్ట్రెయింట్ అలవాటు చేసుకుంటే తప్ప చుట్టూ ఉన్న ఇంతమంది శత్రువులతో పోరాడలేరు. ఇప్పుడు ఎమోషన్‌కు లొంగిపోయి తర్వాత పశ్చాత్తాప పడడం వల్ల లాభం లేదు. అందువల్ల ఆ ఎమోషన్‌ని నియంత్రణలో ఉంచుకోవడం నేర్చుకోండి. అదే నా దృష్టిలో విద్యయొక్క నిజమైన విలువ.
 కారు చాలా వేగంగా పోగలదు. కాని దానికి బ్రేకుల్లేవంటే మనం ఆ కారు ఎక్కుతామా? కారుకు వేగం ఎంత ముఖ్యమో, ఆగడం అంత ముఖ్యం. లేకపోతే యాక్సిడెంట్ తప్పదు. ఈ బ్రేకే సెల్ఫ్ రిస్ట్రెయింట్. అన్నింటినీ చూసి, అన్నింటినీ తెలుసుకోగలగడం స్పీడ్.
 
మీరు మీ బలహీనతను తెలుకోవడం గొప్పదనం. దాన్ని తెలుసుకొని ఎలా అధిగమించాలో కూడా తెలుకోవాలి. విద్య అన్నదానికి యథార్థమైన విలువ ఇది. అప్పుడు మీ ప్రవర్తన గొప్పదవుతుంది. విద్యకు తక్షణ ఫలితం ప్రవర్తనే. ఎంత చదివాడన్నదానికంటే ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడన్నది ముఖ్యం.

కనీసంలో కనీసం సంతృప్తికరంగా ఉండాలి. మీరు ఎంత డిస్టింక్షన్లో పాసవ్వండి. మీకు గోల్డ్ మెడల్ ఉండనీ, మీ కాలేజీ పిన్సిపాల్ మీకిచ్చే కాండక్ట్ సర్టిఫికెట్‌లో మోస్ట్ అన్ డిపెండబుల్ అన్ శాటిస్ ఫ్యాక్టరీ. మిస్‌చువస్ అని రాసి సంతకం పెట్టి ఇచ్చాడు అనుకోండి. ఎంత గొప్ప చదువు చదివినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. మీ రేప్పొద్దున ఉద్యోగానికి వెళ్లినా మీ ఇమిడియెట్ బాస్ దగ్గర ట్రస్ట్ట్‌వర్థీనెసేనా అని అడుగుతారు. ఈ ట్రస్ట్‌వర్థీనెస్ అనేది ఎవరికి వారు తనంత తాను అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఇరవై వేలు వస్తున్నాయి. ఇరవై అయిదు వేలు ఎక్కడ వస్తాయని వెదుక్కుంటూ ఉన్నవాడు బాటసారి లాంటివాడు.

అలా ఉండకూడదు. మనిషన్న వాడు ఎంతలో ఉన్నా అంతలో నిలబడాలి. ఆ సంస్థకి కీర్తి తేవాలి. మీ ఈ ట్రస్ట్ వర్థీనెస్ అన్నదాన్ని బాగా డెవలప్ చేసుకోండి జీవితంలో. ఒక్క మాట మీ మాట్లాడితే అందరూ శద్ధగా వినాలి. మీరు ఎక్కడ ఉన్నా అందరూ మీ పేరు చెప్పుకొని సంతోషించాలి. అదీ ట్రస్ట్ వర్థినెస్ అంటే, వాడు నాకొడుకని తండ్రి, మా అబ్బాయేనని తల్లీ, మా ఆయనే అని భార్య, మానాన్నగారని కొడుకు, మా స్టూడెంట్ అని కాలేజీ, మా ఊళ్లో ఉంటారని ఊరు, మా దేశంలో ఉంటారని దేశం సంతోషించాలి.

దీనికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా? ఎంత పెద్ద రావి చెట్టయినా? చిన్న విత్తనంలో దాని వ్యూహం అంతా ఉన్న్టది. ఇదంతా ట్రస్ట్ వర్థీనెస్ డెవలప్ చేసుకోవడంలో ఉంటుంది. ట్రస్ట్ వర్థీనెస్ ఎక్కడుంటుందో తెలుసా. క్లారిటీ ఇన్ థాట్లో ఉంది. ది వాల్యూ ఇన్ ది ఎడ్యుకేషన్ ఈజ్ రిజెల్టెడ్ ఓన్లీ ఇన్ ది క్లారిటీ థాట్. వెయ్యిమందిలో 999 మంది సొల్లు మాట్లాడవచ్చు ఒక్కడుంటాడు. ఒకటే మాట మాట్లాడతాడు. కానీ ఎంత స్పష్టత ఉంటుందో. కంచి పరమాచార్య ఉండేవారు. వారి దగ్గరికి వెళ్లి మీరేదయినా పశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు.

ఓ రెండు మూడు నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించి జవాబు చెప్పేవారు. ఆయన ఒకసారి స్కూలు పిల్లలతో ఇరవై నిమిషాలపాటు మాట్లాడిన అనుగ్రహభాషణం 36 భాషల్లోకి తర్జుమా అయ్యింది. ఎందుకు తర్జుమా అయ్యింది... ఒక్కటే కారణం. క్లారిటీ ఇన్ థాట్. ఆలోచనలో స్పష్టత. ఎమోషనల్‌గా మాట్లాడటం అందరూ చేస్తారు. చాలామంది మాటలకు మూల సిద్ధాంతాలే ఉండవు. అందుకనే వాళ్లు మాట్లాడిన మాటలను చివరకు వాళ్లే ఖండించుకుంటారు. ఆలోచనలో స్పష్టతలేనిది ఎంత చదివి ఏం లాభం?
 
మన దరిద్రమేమిటంటే నాయకులు కూడా వాళ్లకిష్టమైన వారినే పాఠ్య పుస్తకంలో వేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రిగారి పేరు ఇవాళ చాలామందికి తెలియదు. సర్దార్ పటేల్ జీవిత చరిత్ర చదివిన వాళ్లు ఎంతమంది ఉన్నారీవాళ? రాజారామ్మోహనాయ్, లాలాలజపతి రాయ్, మహాత్మాగాంధీ లాంటి వారి జీవిత చరిత్ర ఇవ్వాళ ఎంతమంది చదివారు. మీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు మీ చదువుతున్న చదువు ఒక్కటే కాంట్రిబ్యూట్ చేయదు. మీరు ఒకటే  గుర్తుపెట్టుకోండి. అన్నింటికన్నా జీవితంలో క్యారెక్టర్ మౌల్డింగ్ చాలా అవసరం.

హైపర్ సెన్సిటివ్ అన్నది మనకు అంతర్గత శత్రువన్నది గుర్తించాలి. మన ధోరణి మనదే కానీ, అవతలి వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారన్నది ఆలోచించని వాడు ఎంత పెద్ద పొజిషన్‌కి వెళితే అంత ప్రమాదకరం. మనిషి ఎదుగుదలకు హేతువు ఎదుటివాడు ఏమి చెప్నాడన్నది వినడం. ముందు వినాలి. క్లారిటీ ఆఫ్ థాట్ నేర్చుకోవాలి. ఎదుటి వారి గురించి అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడమే వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement