సైన్స్ అండ్ టెక్నాలజీలో మగువలకు అవకాశాలెన్నో... | women to get more opportunities for Science and technology sector | Sakshi
Sakshi News home page

సైన్స్ అండ్ టెక్నాలజీలో మగువలకు అవకాశాలెన్నో...

Published Fri, Aug 8 2014 12:46 AM | Last Updated on Sat, Sep 15 2018 7:39 PM

సైన్స్ అండ్ టెక్నాలజీలో మగువలకు అవకాశాలెన్నో... - Sakshi

సైన్స్ అండ్ టెక్నాలజీలో మగువలకు అవకాశాలెన్నో...

మేరీ క్యూరీ.. రోజాలిండ్ ఫ్రాంక్లిన్.. కల్పనాచావ్లా.. టెస్సీథామస్.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఘనవిజయాలు సాధించిన మహిళలు! భారతదేశ జనాభాలో 48 శాతం ఉన్నా.. నేటికీ సైన్స్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం 30శాతానికి లోపే ఉంది. ఈ రంగంలో నిష్ణాతులైన మానవ వనరులు కలిగిన దేశం వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. దేశాభివృద్ధికి చోదక శక్తి .. సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాంటి శాస్త్ర సాంకేతిక రంగంలో లింగ వివక్షకు తావులేదు. ఆసక్తి ఉన్నవారెవరైనా ఇందులోకి ప్రవేశించవచ్చు. ప్రతిభతో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.  సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళలకు స్కాలర్‌షిప్స్, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక ఫోకస్..   
 
 భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే కొంత నిరాశ కలుగుతుంది. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ప్రదానం చేస్తున్న మొత్తం పీహెచ్‌డీల్లో మహిళల శాతం కేవలం 37. మిగతా 63 శాతం  పీహెచ్‌డీలను పురుషులు సొంతం చేసుకుంటున్నారు.  ఐటీ, బయోటెక్నాలజీ, ప్యూర్ సైన్స్ రంగాల్లో మహిళలు 30 శాతంలోపే ఉన్నారు. దాంతో ఇందులో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయి వరకు మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వీరికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తోంది. పలు సంస్థలు ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాయి. స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తున్నాయి. ఉమెన్ సైంటిస్ట్‌లు/రీసెర్చర్లకు పలు రకాల రీసెర్చ్ గ్రాంట్లు, ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆఫర్ చేస్తున్న కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం..
 
 డిపార్‌‌టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
 బయోటెక్నాలజీ పరిశోధనల్లో మహిళా సైంటిస్ట్‌ల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో డిపార్‌‌టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సైంటిస్ట్‌ల కెరీర్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.
 వెబ్‌సైట్: http://dbtindia.nic.in/index.asp
 
 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)
 సైన్స్‌లో అడ్వాన్స్‌డ్ స్టడీస్, రీసెర్చ్ రంగాల్లో మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను ఆఫర్ చేస్తోంది. పీహెచ్‌డీ పూర్తిచేసి, ఉద్యోగం లేని మహిళా అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లు పొందడానికి అర్హులు.
 వెబ్‌సైట్: www.ugc.ac.in
 
 సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఇన్ సెన్సైస్(సీఐసీఎస్)
 పేటెంట్ ఫెసిలిటేటింగ్ సెంటర్, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్(టీఐఎఫ్‌ఏసీ)తో కలిసి సీఐసీఎస్... పేటెంట్ వ్యవహారాల్లో మహిళా సైంటిస్ట్‌లకు శిక్షణ ఇస్తోంది. వీరికోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ... స్కాలర్‌షిప్ స్కీమ్‌ను కూడా ప్రారంభించింది. సైన్స్, ఇంజనీరింగ్ వంటి అర్హతలు కలిగిన మహిళలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్లపై పరిజ్ఞానం కల్పిస్తారు. దేశవ్యాప్తంగా నాలుగు చోట్ల  సీఐసీఎస్, చెన్నై; టీఐఎఫ్‌ఏసీ, న్యూఢిల్లీ; యూఆర్‌డీఐపీ, పుణె; ఐఐటీ, ఖరగ్‌పూర్‌లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  ప్రతిఏటా దాదాపు 100 మందికి శిక్షణ ఇస్తారు.
 
 ఎల్ ఓరియల్ ఇండియా ఫర్ యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ సైన్స్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్న యువ మహిళా పరిశోధకులకు అండగా నిలిచేందుకు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను 2003లో ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన యువతులకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతిఏటా రూ.2.5 లక్షలు అందజేస్తారు. గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీలో సైన్స్ కోర్సులు చదువుతు న్నవారు అర్హులు.
 వెబ్‌సైట్: www.foryoungwomeninscience.com
 
 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా ఇండియన్ ఆయిల్‌కార్పొరేషన్(ఐఓసీ) దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావం తులైన విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. వికలాంగులకు ప్రాధాన్యం ఉంటుంది.
 వెబ్‌సైట్: www.iocl.com
 
 అగ్రికల్చర్.. బయోటెక్నాలజీ
 అగ్రికల్చర్, బయోటెక్నాలజీ రంగాలు శరవేగంగా వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఈ రంగాల్లో విద్యార్థులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రంగంలో మహిళలు అవకాశాలు అందుకోవచ్చు.  అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ కార్యక్రమాలు కూడా మరింత మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర,రాష్ట్ర విభాగాలు సైతం మహిళా సైన్స్ గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తున్నాయి. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం పలు స్కీమ్స్‌ను నిర్వహిస్తూ శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ సంబంధిత కంపెనీలు ప్రారంభించేలా రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలతో కలిసి నాబార్డ్ మహిళా గ్రాడ్యుయేట్లకు ఆర్థిక చేయూతనూ అందిస్తోంది.
 ఇన్‌పుట్స్: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్
 
 డిపార్‌‌ట్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
 వ్యక్తిగత, అనివార్య కారణాల వల్ల సైన్స్ రంగంలో కెరీర్ నుంచి మధ్యలోనే తప్పుకున్న మహిళలను తిరిగి రప్పించి, పరిశోధనలను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. మహిళా సైంటిస్ట్‌లకు, టెక్నాలజిస్ట్‌లకు ఉపకార వేతనాలను అందిస్తోంది. వెబ్‌సైట్: www.dst.gov.in
 
 మహిళా పరిశోధకుల కోసం..
 ఏ డీఎస్‌టీస్ ఉమెన్ సైంటిస్ట్స్ స్కీమ్
 వెబ్‌సైట్: www.iisc.ernet.in
 ఏ యంగ్ సైంటిస్ట్ స్కీమ్ ఆఫ్ డీఎస్‌టీ
 వెబ్‌సైట్: www.dst.gov.in
 ఏ ఉమెన్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ ఆఫ్ డీబీటీ
 వెబ్‌సైట్: http://dbtindia.nic.in/index.asp
 ఏ బయో-కేర్ ప్రోగ్రామ్/అవార్డ్స్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్స్
 వెబ్‌సైట్: http://dbtindia.nic.in/index.asp
 ఏ యూఆర్‌డీఐపీ ఉమెన్ సైంటిస్ట్ స్కాలర్‌షిప్ స్కీమ్
 వెబ్‌సైట్: www.helpbiotech.blogspot.in
 ఏ సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్
 వెబ్‌సైట్: www.wcd.nic.in
 ఏ నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్
 వెబ్‌సైట్: www.nmew.gov.in
 ఏ మదర్ థెరెసా ఛారిటబుల్ ట్రస్ట్
 వెబ్‌సైట్: www.motherteresacharities.org
 ఏ విజన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
 వెబ్‌సైట్: www.visionfoundationofindia.in
 
 మహిళలకు ప్రోత్సాహం
 ‘‘సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళలకు విస్తృత అవకాశాలున్నాయి. మహిళలు సైతం సామాజిక పరిస్థితులను ఎదుర్కొని శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మహిళలను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ఫెలోషిప్‌లు అందిస్తూ మహిళల అభ్యున్నతికి తోడ్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఆశించిన స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళల పాత్ర పెరగాలంటే వారిలో స్వీయ ప్రోత్సాహం ఉండాలి.
 
 మనోధైర్యంతో ముందుకు సాగాలి. విస్తృత పరిజ్ఞానంతో ఆలోచించాలి. సమాజంలో ఉన్నత విద్యనభ్యసించిన మహిళలు కూడా కుటుంబాలకే పరిమితమవుతున్నారు. చిన్నపాటి ఉద్యోగాల్లో చేరుతున్నారు. సామాజిక పరిస్థితులు అందుకు కారణమై ఉండొచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవకాశాలను అందిపుచ్చుకుని కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేయాలి. ఉన్నత విద్యాభ్యాసానికి అందిస్తున్న ఫెలోషిప్‌లను వినియోగించుకోవాలి. గృహిణులుగా స్థిరపడిన మహిళలు కూడా మళ్లీ పరిశోధనలవైపు మరల్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
 - డా. డి. శారద
 అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ
 ఐఐటీ, హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement