ప్రైవేటు బస్సులో రూ. 8 కోట్లు స్వాధీనం
ఎన్నికలు సమీపించే కొద్దీ కట్టల పాములు బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటున్నాయి. లేచి బుసలు కొడుతున్నాయి. ఎన్నికల అధికారులు విస్తృతంగా చేస్తున్న తనిఖీలలో భారీ ఎత్తున డబ్బు బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశం మొత్తమ్మీద స్వాధీనం చేసుకుంటున్న డబ్బులో దాదాపు సగం మన రాష్ట్రంలోనివేనని ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఒకేసారి 8 కోట్లు దొరకడంతో ఈ వాటా మరింత పెరిగేలా ఉంది.