న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత అద్వానీ అధికారిక వైబ్‌సైట్ (ఠీఠీఠీ.జ్చుఛీఠ్చిజీ.జీ)పై పాకిస్థాన్ హ్యాకర్లు సోమవారం దాడి చేశారు. కాశ్మీర్‌ను విముక్తం చేయాలంటూ అందులో సందేశాలను పోస్ట్ చేశారు. మహహ్మద్ బిలాల్‌గా తన పేరును పరిచయం చేసుకున్న హ్యాకర్ శుభోదయం నరేంద్ర మోడీ అంటూ ప్రారంభించి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు.
‘పాకిస్థాన్ జిందాబాద్, కాశ్మీర్లో సైనిక పాలన ముగిసిపోవాలి’ అంటూ సందేశాలను పోస్ట్ చేశాడు. కాశ్మీర్ విషయంలో మోడీ తన దగ్గరకు ఇద్దరు దూతలను పంపారని కాశ్మీర్ నేత గిలానీ ప్రకటన చేసిన నేపథ్యంలో... హ్యాకర్లు ఈ చర్యకు పాల్పడడం గమనార్హం.
అద్వానీ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి
Published Tue, Apr 22 2014 4:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement