సాక్షి, ఏలూరు : రాష్ట్ర విభజన నిర్ణయంతో జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఆదివారం రాత్రి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జిల్లాలో 2 లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలుండగా 2 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. తణుకు, కొవ్వూరు, ఉంగుటూరు, చింతలపూడి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నాయకులెవరూ ముందుకు రాకపోవడంతో దొరికినవారికి వారి స్థాయితో సంబంధం లేకుండా సీట్లు కేటాయించారు. సిట్టింగ్‌ల్లో పార్టీలో ఉన్న ముగ్గురిలో ఒక్కరికి సీటు దక్కింది. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ కనుమూరి బాపిరాజు బరిలో నిలుస్తున్నారు. ఆయన మినహా మిగతా వారందరూ కొత్తవారే కావడం గమనార్హం. ఏలూరు లోక్‌సభ టిక్కెట్ లిక్కర్ సిండికేట్ ముసునూరి నాగేశ్వరరావుకు ఇచ్చారు. నాగేశ్వరరావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించినా లభించలేదు. కాంగ్రెస్ కుదేలవడంతో ఇప్పుడు ఏకంగా లోక్‌సభకే పోటీచేసే అవకాశం దక్కింది. కొత్త వారిలో కొందరు కనీసం మండల స్థాయి నాయకులు కూడా కాకపోవడం విశేషం. అభ్యర్థులు దొరక్కపోవడంతో కాంగ్రెస్ పార్టీ చివరికిలా సరిపెట్టింది.
లోక్‌సభ అభ్యర్థులు
ఏలూరు ముసునూరి నాగేశ్వరరావు
నరసాపురం కనుమూరి బాపిరాజు
అసెంబ్లీ అభ్యర్థులు
ఏలూరు వెంకట పద్మరాజు
దెందులూరు మాగంటి వీరేంద్రప్రసాద్(బబ్బు)
తాడేపల్లిగూడెం దేవ తి పద్మావతి
నిడదవోలు కామిశెట్టి వెంకట సత్యనారాయణ
నరసాపురం కలవకొలను నాగతులసీరావు
పాలకొల్లు కరిమెరక బాల నాగేశ్వరరావు
భీమవరం యార్లగడ్డ రాము
ఉండి గాదిరాజు లచ్చిరాజు
ఆచంట ఇందుకపల్లి రామానుజరావు
గోపాలపురం ఖండవల్లి కృష్ణవేణి
పోలవరం కంగాల పోశిరత్నం
కాంగ్రెస్.. చివరికిలా
Published Mon, Apr 14 2014 2:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement