బొబ్బిలి నియోజకవర్గ పార్టీ పరిస్థితి దారుణం
పురపాలక సంఘంలో బలవంతంగా పోటీ
మండలాల్లో అభ్యర్థులు కరువు
రామభద్రపురం, బాడంగి మండలాల్లో ఒక్కొక్కరు
తెర్లాంలో ముగ్గురు నామినేషన్లు
బొబ్బిలి, న్యూస్‌లైన్: బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. బొబ్బిలి రాజులను ఢీకొంటాం... కోట గోడలు బద్ద లు కొట్టేస్తామంటూ బీరాలు పలికిన ఆ పార్టీ నియోజకవర్గంలో పూర్తిగా తుడుచుకుపోయింది.
మండలాల్లో ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు. గత పంచాయతీ ఎన్నికల్లోనే అంతంతమాత్రంగా ఉన్న ఆ పార్టీ పరిస్థితి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి మ రింతగా దిగజారిపోయింది.
మున్సిపల్ ఎన్నికలకు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టకపోతే పార్టీ లేదనుకుంటారేమోనని కొన్ని వార్డుల్లో ఎవరో ఒకరిని పోటీకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిం ది.. అయితే ఆ పరిస్థితి గ్రామాల్లోకి వెళ్లే సరి కి తారుమారైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చే యడానికి అభ్యర్థులే లేని గడ్డు పరిస్థితి ఎదురైంది..150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇంత దయనీయంగా తయారవుతుందని ఎవ్వరూ ఊహిం చకపోవడంతో మిగిలిన నాయకులకు రానున్న ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వస్తుందేమోనన్న భయాందోళన పట్టుకుంది. తొలి నుంచీ కాం గ్రెస్‌కు బొబ్బిలిలో మంచి పట్టుంది.
డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా అదే పార్టీ నుంచి విజయంసాధించగా, బొబ్బిలి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కూడా అఖండ మెజార్టీతో అదే పార్టీలో ఉంటూ విజయం సాధించారు. ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా.. మొదటిసారి 12 వేలకు పైగా, రె ండోసారి 24 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీకి సుజయ్‌కృష్ణ రంగారావు రాజీనామా చేసిన తరువాత పూర్తిగా పరిస్థితి దిగజారిపోయింది. నియోజవకర్గంలోని కాంగ్రెస్ కేడర్‌లో అధిక శాతం రాజుల వెంట నడవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. దీంతో బొబ్బిలిలో అసెంబ్లీకి నిలబడడానికి అభ్యర్థులు లేని పరిస్థితి ఎదురైంది.
రామభద్రపురంమండలంలో టీటీడీ బోర్డు సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ స భ్యుడు అప్పికొండ శ్రీరాములు నాయుడు, తెర్లాంలోని నర్సుపల్లి బాబ్జీరావు, బొబ్బిలిలోని ఇంటి గోపాలరావు వంటివారే పార్టీ ని లాగేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ సమయ ంలో పార్టీలోకి ప్రభుత్వ మాజీ విప్ శంబంగిని తెచ్చారు.
దీంతో ఇక పరవాలేదనుకొనేలోగా రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నుంచి ఆ పార్టీని వదిలేసి నాయకులంతా వెళ్లిపోయారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వే యడానికి కూడా అభ్యర్థులు దొరకని పరి స్థితి ఏర్పడింది. రామభద్రపురంలో 14 స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కా గా, బాడంగిలోని 14 స్థానాలకు ఒకటే నా మినేషన్ వేశారు. బొబ్బిలి లో 19 స్థానాలకు 24 మంది నామినేషన్లు వేయగా, తెర్లాం మండలంలో 17 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేశారు.