
పగతీర్చుకోవాలంటే బిజెపికి ఓటు: ఇసికి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, ఉత్తరప్రదేశ్(యుపి) బిజెపి వ్యవహారాల బాధ్యుడు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. షా ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఓటర్లను రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని యుపి కాంగ్రెస్ ఆరోపించింది.
పగ తీర్చుకోవాలంటే లోక్సభ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలని షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అమిత్ షాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని కోరింది.