ఆ ఈవీఎంలో ఓట్లన్నీ కాంగ్రెస్కే!! | Defective Pune EVM 'transfers' all votes to Congress | Sakshi
Sakshi News home page

ఆ ఈవీఎంలో ఓట్లన్నీ కాంగ్రెస్కే!!

Published Thu, Apr 17 2014 10:49 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

ఆ ఈవీఎంలో ఓట్లన్నీ కాంగ్రెస్కే!! - Sakshi

ఆ ఈవీఎంలో ఓట్లన్నీ కాంగ్రెస్కే!!

ఈవీఎంలలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎవరికి ఓటేసినా.. ట్యాంపరింగ్ చేస్తే తమకు కావల్సిన వాళ్లకు ఆ ఓట్లు మళ్లించుకోవచ్చని ఎంతమంది చెప్పినా వినిపించుకోలేదు. గురువారం నాటి ఎన్నికలలో ఈ విషయం ప్రత్యక్షంగా రుజువైంది. మహారాష్ట్రలోని పుణెలో ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈవీఎంలో ఎవరికి ఓటేసినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందున్న లైటు మాత్రమే వెలుగుతోంది. అంటే అక్కడి ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి బదిల అయిపోయాయన్నమాట.

పుణెలోని శాంరావు కల్మాడీ స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఇలా జరుగుతీఉన్న విషయాన్ని చూసి గుర్తించిన కొంతమంది ఓటర్లు ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వాళ్లు వెంటనే పోలింగ్ను నిలిపివేశారు. అయితే అప్పటికే చాలామంది అక్కడ ఓట్లు వేసేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు వెంటనే ఇక్కడకు కొత్త ఈవీఎం తెప్పించాలని ఆదేశించారని, అది త్వరలోనే రావచ్చని బీజేపీ కార్యకర్త ఒకరు తెలిపారు. కాగా, అప్పటికే ఓట్లు వేసిన 28 మంది ఓటర్లను మరోసారి కొత్త మిషన్లో ఓట్లు వేయించడానికి అనుమతించాలని ఈసీ నిర్ణయించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement