మమ్మల్నే ఎందుకు అడుగుతారు?
న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయాన్ని ఆ పార్టీనే అడగాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ విషయం తమను ఎందుకు అడుగుతారని మీడియాను దిగ్విజయ్ సింగ్ ఎదురు ప్రశ్నించారు. సీపీఐతో పొత్తు ఖరారైందని తెలిపారు. సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే ప్రచారం మొదలు పెడతామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని దిగ్విజయ్ అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే లౌకికవాదం నుంచి పక్కకు పోయినట్టేనని అన్నారు. తెలంగాణకు మొదట మద్దతు పలికి, ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేశారని తెలిపారు.