అరవింద్ కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అమేథీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆదివారం ఈ నోటీసు ఇచ్చింది. మే 13వ తేదీ సాయంత్రంలోగా కేజ్రీవాల్ వివరణ ఇచ్చేందుకు గడువు విధించింది. ఆ లోపుగా కేజ్రీవాల్ తన వివరణను సమర్పించని పక్షంలో ఈ అంశంపై తామే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మే 2న అమేథీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క ఓటు వేసినా అది దేశాన్ని, దైవాన్నీ మోసగించడమే అవుతుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది.