'మానసిక లోపాలుంటే బాలయ్య తప్పుకోవాలి' | If balakrishna mental balance is not good, quit to contest, says suravaram sudhakar reddy | Sakshi
Sakshi News home page

'మానసిక లోపాలుంటే బాలయ్య తప్పుకోవాలి'

Published Sat, May 3 2014 10:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'మానసిక లోపాలుంటే బాలయ్య తప్పుకోవాలి' - Sakshi

'మానసిక లోపాలుంటే బాలయ్య తప్పుకోవాలి'

అనంతపురం : అనంతపురం జిల్లా హిందుపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగుందనుకుంటున్నానని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ  మానసిక లోపాలుంటే పోటీ నుంచి బాలయ్య తప్పుకోవడం మంచిదని ఆయన హితవు పలికారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని అందుకే రాత్రికి రాత్రే పార్టీలో చేరిన మాఫీయాలకు టిక్కెట్లు ఇచ్చారని సురవరం శనివారమిక్కడ అన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు అత్యంత ప్రమాదకరమని, ఆ పొత్తు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిందని సురవరం విమర్శించారు.

రాజకీయాల్లో ధన ప్రవాహాం మొదలు పెట్టిందిన చంద్రబాబు నాయుడేనని అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి క్రూరుడని, పాలెం వోల్వో బస్సు ఘటనకు జేసీ బాధ్యుడని సురవరం మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలన్న జ్ఞానం కూడా జేసీకి లేదన్నారు. పాలెం ఘటనను ఖండించిన బాబు,...మరి జేసీ సోదరులకు టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.  మోడీ, చంద్రబాబు, పవన్ కలయిక అపవిత్రమని అన్నారు. బీజేపీ, టీడీపీ అవినీతి పవన్కు గుర్తు రాలేదా అని సురవరం ప్రశ్నించారు. పవన్ కంటే చిరంజీవి పాపులర్ నటుడని, అలాంటి చిరంజీవే రాజకీయాల్లో విఫలం అయ్యారని ఆయన వ్యాఖ్యాలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement