కమాన్‌చౌరస్తా, న్యూస్‌లైన్ : మనచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు... దేశంలోని పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయే క్షణంలో తెలుసుకోవచ్చు. పోలింగ్ సెంటర్లు ఎక్కడున్నాయి.. వాటిని చేరుకునేందుకు దారి.. ఇలాంటి విషయాలు ఇట్టే తెలుసుకోవచ్చు. నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను సైతం సూచిస్తుంది. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాలను చూసుకునే అవకాశం కల్పించింది. దీనికోసం మీ మొబైల్ ఫోన్‌లో ఏదైనా బ్రోజర్‌ను తెరిచి అనే వెబ్‌సైట్‌లో పోలింగ్ కేంద్రాల వివరాలను అందుబాటులో ఉంచారు. వెబ్‌సైట్ వివరాలు టైప్‌చేయగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ తెరుచుకుంటుంది.
కుడివైపున పోలింగ్‌స్టేషన్ మ్యాప్‌పై క్లిక్ చేయగానే పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్ అనే పేజీ తెరుచుకుంటుంది. అందులో ఉండే అప్షన్‌లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్‌స్టేషన్లను ఎంపిక చేసుకోవాలి. పక్కనే ఉన్న క్లిక్‌హియర్ అనే బటన్‌ను నొక్కగానే పోలింగ్ కేంద్రం ఎక్కడుందో క్షణంలో చూపిస్తుంది. ఇది రెండు రూపాల్లో అందుబాటులో ఉంటుంది. ఒకటి మ్యాప్, రెండోది శాటిలైట్ వ్యూ రూపంలో ఉంటుంది. మనకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవాలి. మనకు కావాల్సిన విధంగా మన స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలో కూడా తెలుసుకోవచ్చు.
చదువు, ఉద్యోగ నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉండేవారు, స్థానిక వివరాలు సరిగా తెలియనివారు సులభంగా పోలింగ్ కేంద్రాల గురించి తె లుసుకోవచ్చు. దీంతోపాటు ఎన్నికల సిబ్బంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సి వచ్చినప్పుడు వారికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. దీంతో వారు అక్కడికి ఎలా వెళ్లాలి.. చుట్టుపక్కల గల ప్రాంతాలు ఉన్నాయనే విషయం పోలింగ్ స్టేషన్ లోకెషన్ గ్యూగుల్ మ్యాప్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
అరచేతిలో పోలింగ్ సెంటర్
Published Sat, Mar 29 2014 2:07 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement