ఈ ఎన్నికల్లో స్వతంత్రులు గణనీయ ప్రభావాన్ని చూపారు. ఒక స్థానంలో గెలవడంతో పాటు పలు స్థానాల్లో రెండవస్థానంలో నిలిచారు.
గణనీయంగా ప్రభావం చూపిన స్వతంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో స్వతంత్రులు గణనీయ ప్రభావాన్ని చూపారు. ఒక స్థానంలో గెలవడంతో పాటు పలు స్థానాల్లో రెండవస్థానంలో నిలిచారు. అనేక చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి కారకుల య్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ స్థానంలో స్వంత్రుడిగా పోటీచేసిన కాంగ్రెస్ రెబల్ దొంతి మాధవరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిపైనే గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంత్రులుగా రంగంలోకి దిగి రెండవ స్థానాన్ని దక్కించుకున్న వారిలో జువ్వాడి నర్సింగరావు (కోరుట్ల), చందర్ (రామగుండం), సంకినేని వెంకటేశ్వరరావు (సూర్యాపేట), భూపాల్‌రెడ్డి (నల్లగొండ), స్రవంతి (మునుగోడు), జిట్టా బాలకృష్ణారెడ్డి (భువనగిరి) ఉన్నారు. కాంగ్రెస్ టికెట్లు దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలో నిలిచి నిర్మల్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ - కాగజ్‌నగర్ నుంచి కోణప్ప గెలిచి ప్రధానపార్టీలకు షాక్ ఇచ్చారు.