అమరవీరుల కుటుంబాలకు 100కోట్లతో ట్రస్ట్ | Jairam Ramesh release Congress manifesto for Telangana | Sakshi
Sakshi News home page

అమరవీరుల కుటుంబాలకు 100కోట్లతో ట్రస్ట్

Published Sat, Apr 12 2014 2:25 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

Jairam Ramesh  release Congress manifesto for Telangana

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆపార్టీ కేంద్రమంత్రి జైరాం రమేష్ శనివారం గాంధీభవన్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మేనిఫెస్టో వివరాలు:

*ఉద్యోగ విరమణ వయసు 60 యేళ్లు
*రూ. 100 కోట్లతో అమరవీరుల కుటుంబాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్టు
*సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికి వేతనం
*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నవోదయ తరహా స్కూళ్లు
*ప్రతి రెవెన్యూ డివిజన్‌కు పాలిటెక్నిక్ కాలేజి
*ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు
*సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు లక్ష రూపాయలు ప్రోత్సాహకాలు
*ప్రతి రైతుకు రూ.10 వేల ప్రోత్సాహకం
*చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయహోదా
*చెరువుల పునరుద్దరణ, మైనార్టీలకు సబ్‌ప్లాన్
*చిన్న, మధ్యతరహ ప్రాజెక్టులకు ప్రాధాన్యత
*కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేస్తాం
*క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ
*లక్ష ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ
*ఉద్యోగ వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు
*తండాలను గ్రామపంచాయతీలుగా మార్పు
*బీసీలకు కూడా సబ్ ప్లాన్, అందరీకి ఆరోగ్యం
*ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజి కమ్ సూపర్ స్పెషాలిటి హస్పిటల్
*పాఠశాల విద్యార్థులకు పాలు, మధ్యాహ్న భోజనం, జత బూట్లు
*రెండేళ్లలో కాలేజి లెక్చరర్ల భర్తీ
*ఉద్యానవన, వ్యవసాయ, వెటర్నరి యూనివర్శిటీల ఏర్పాటు
*ప్రవేట్ విద్యాసంస్థల్లో కూడా రిజర్వేషన్ల అమలు
*ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక
*మైనార్టీలకు,గిరిజనులకు,ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళికలు
*ఎనిమిదేళ్ల సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలర్
*రైతులకు 7 గంటల పగటిపూట విద్యుత్
*సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత
*ప్రతి మండలంలో 30 మెగవాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు
*9-10 కొత్త జిల్లాల ఏర్పాటు, పెన్షన్ రూ. 1000లకు పెంపు
*విద్యార్థులకు పాలు, మధ్యాహ్న భోజనం, జత బూట్లు
*రెండేళ్లలో కాలేజి లెక్చరర్ల భర్తీ



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement