వైఎస్సార్ సీపీకి జనసేన నేతల మద్దతు | janasena leaders support to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకి జనసేన నేతల మద్దతు

Published Thu, May 1 2014 3:11 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

వైఎస్సార్ సీపీకి జనసేన నేతల మద్దతు - Sakshi

వైఎస్సార్ సీపీకి జనసేన నేతల మద్దతు

కొవ్వూరుటౌన్/ భీమవరం అర్భన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నట్టు కొవ్వూరు, భీమవరం పట్టణాల్లోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు.మంగళవారం పెరవలిలో జనసేన కార్యకర్తలు నిడదవోలు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజీవ్ కృష్ణకు సంఘీభావం ప్రకటించగా బుధవారం కొవ్వూరు, భీమవరంలో ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ జనసేన యూత్ వైఎస్సార్ సీపీ పార్లమెంటు, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు గంటా చిరంజీవి బుధవారం ప్రకటించారు.
 
ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమి హరిచరణ్ తదితర నాయకుల సమక్షంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని చిరంజీవి చెప్పారు. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పట్టాభి రామారావు, జనసేన యూత్ డేగల రాము, అల్లు శ్రీను, నాయుడు బాబ్జి, ఆవుల వాసు, ముత్యాల సాయి, మహరాజు వాసు, కళ్లేపల్లి శ్రీను, మట్టా సతీష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement