కంప్లి, న్యూస్‌లైన్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దళితుల ఇళ్లకు హనీమూన్‌కు వెళతారని బాబా రాందేవ్ దళితులను, దళిత మహిళలను కించపరిచాడని ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ సేన జిలా ్ల అధ్యక్షుడు సీ.వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం సమితి సభ్యులతో స్థానిక పోలీస్‌స్టేషన్ చేరుకుని ఎస్‌ఐ హులుగప్పకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను, దళితవాడలను అభివృద్ధి చేసే రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో వారి ఇళ్లకు వెళ్లడం సహ జమన్నారు. రాహుల్‌గాంధీతోపాటు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారన్నారు. అయితే పేదలను అంటరాని వారని అవహేళనగా చూడటం మంచిది కాదన్నారు. అలాంటి బాబా రాందేవ్‌పై గూండా చట్టం, మానవహక్కుల ఉల్లంఘన చట్టం కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్.హనుమంత, చంద్రశేఖర్, రాజు, శివప్ప, పీ.అంజినప్ప, రవి తదితరులు పాల్గొన్నారు.