హైదరాబాద్ : ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం బట్టబయలు కానుంది. 43 రోజుల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో ఫలితాల సస్పెన్స్ వీడనుంది. రాష్ట్రంలోని 145 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది.
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 65 ప్రాంతాల్లో 155 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 39 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. మరోవైపు కౌంటింగ్ కేంద్రాలవద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల తరువాత 12వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టింది.
ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
Published Mon, May 12 2014 8:23 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement