
వారణాసిలో నామినేషన్ దాఖలుచేసిన మోడీ
జన సునామీ వెంటరాగా.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నాడు వారణాసి లోక్సభ నియోజకవర్గానికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన వెంటన సన్నిహిత సహచరుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు రవిశంకర్ ప్రసాద్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
అంతకుముందు నరేంద్రమోడీ వారణాసి వీధుల్లో భారీ స్థాయిలో రోడ్షో నిర్వహించారు. ఆయన వెంట భారీ స్థాయిలో జనం నడిచారు. రోడ్లమీద ఎక్కడా అంగుళం కూడా ఖాళీ లేనంత స్థాయిలో అభిమానులు పోటెత్తారు.