చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదు: వైఎస్ విజయమ్మ | no credibility to chandrababu naidu, says ys vijayamma | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదు: వైఎస్ విజయమ్మ

Published Sun, Mar 23 2014 1:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదు: వైఎస్ విజయమ్మ

చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదు: వైఎస్ విజయమ్మ

డోన్: వైఎస్ఆర్‌ ఆశయాలకు, సంక్షేమాలకు వారసత్వంగా పుట్టిందే తమ పార్టీ తని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఎంతోమంది అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు వైఎస్‌ఆర్ తోడ్పడ్డారని గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ చేస్తానని మభ్య పెడుతున్నారని విమర్శించారు. మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదన్నారు. చంద్రబాబు వస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా డోన్‌ వచ్చిన వైఎస్‌ విజయమ్మ వైఎస్ఆర్ జనభేరిలో ప్రసంగించారు.

వైఎస్ఆర్‌ ఆశయాలను జగన్‌బాబు నెరవేరుస్తారని ఆమె హామీయిచ్చారు. ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా జగన్‌బాబు పాలన రావాలన్నారు. డోన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డిని వైఎస్ విజయమ్మ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement