అనంతపురం: కోడ్ ఉల్లంఘన కేసులో పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారధిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యేతో పాటు ఆరుగురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా పరిషత్ సీఈవో విజయేందిర తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక భద్రత కల్పించినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి...జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేస్తే కఠినంగా శిక్షిస్తామని, కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల
Published Sat, Apr 5 2014 3:17 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement