జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి
‘రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఒక్కపైసా కూడా పెంచలేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ.305 మాత్రమే ఉండేది. ధరలు పెంచితే పేదోళ్లపై భారం పడుతుం దని మహానేత భావించేవారు. ఇప్పుడు గ్యాస్ ధర రూ.450కి పెరిగింది. ఆయన మరణించాక కరెంటు చార్జీలు ఐదుసార్లు పెరిగారుు. ఇతర పన్నుల సంగతి సరేసరి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. అన్నిరకాల పన్నులను విపరీతంగా పెంచారు’ అంటూ చంద్ర బాబుపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు.
శుక్రవారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కొవ్వూరులో నిర్వహిం చిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో షర్మిల ఎన్నికల సమర శంఖారావం పూరించారు. మూడుచోట్లా అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. చంద్రబాబు మోసపూరిత విధానాల పైన.. అభిమానుల పరువుతీస్తూ చంద్రబాబుకు అమ్ముడుపోరుున పవన్‌కల్యాణ్ తీరుపైన ఈటెల్లాంటి మాటలతో విమర్శలు సంధించారు.
- చంద్రబాబుకు మాటమీద నిలబడటం తెలీదు
- కుప్పం గ్రామాన్ని అభివృద్ధి చేయలేనివాడు సీమాంధ్రను సింగపూర్ చేస్తాడా
- మోడీకి, పవన్‌కు చంద్రబాబు నీచపాలన గుర్తులేదా
- వైఎస్ చేసిన మేలును గుర్తుంచుకుని ఓటేయండి
- వైఎస్సార్ జనభేరి సభల్లో షర్మిల
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : ‘రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికోసం పోరా టం చేసింది.. రోజులు తరబడి నిరాహార దీక్షలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. విద్యార్థుల ఫీజుల కోసం.. కరెంటు చార్జీలు పెంచినప్పుడు.. రైతుకు కష్టంవస్తే.. చేనేత కార్మికుల సమస్యల పరి ష్కారం కోసం.. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజిస్తున్న దారు ణ పరిస్థితుల్లో జగనన్న మెతుకు కూడా ముట్టకుండా నిరాహార దీక్షలు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ మ్మ సైతం దీక్షలు చేశారు. పార్టీ నాయకులు పోరాటం చేశారు. ప్రజలపక్షాన నిలబడి నేనున్నానంటూ జగనన్న భరోసా ఇచ్చారు.
అటువంటి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కొవ్వూరులలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ‘మీరు ఓటు వేసే సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, మేలును గుర్తు చేసుకోండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలి పించండి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభలకు యువత, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు.
చంద్రబాబు హామీలు నిలబెట్టుకున్నాడా
‘అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నమ్మకు చీర కొనిస్తానన్నా డట ఓ ప్రబుద్ధుడు. చంద్రబాబు తీరు కూడా అలాంటిదే. ప్రజలకు మాట ఇవ్వటం, ఇచ్చిన మాటకోసం నిలబడటం చంద్రబాబుకు తెలుసా. ఆయనను 25 సంవత్సరాలుగా గెలి పిస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కుప్పం పంచాయతీని కనీసం మునిసిపాలిటీగా కూడా తీర్చిదిద్దలేని చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్, మలేషియా, జపాన్ చేస్తాడట’అంటూ చంద్రబాబు తీరుపై షర్మిల నిప్పు లు చెరిగారు. మద్యాన్ని నిషేధిస్తానని, కిలో బియ్యాన్ని రూ.2కే ఇస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కాడని, తన పాలనలో ఒక్కసారైనా రైతులకు రుణమాఫీ కాదు కదా వడ్డీ మాఫీ కూడా చేయలేదని షర్మిల చెప్పారు. చంద్రబాబు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని వైఎస్ చెబితే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని వ్యంగ్యంగా మాట్లాడాడని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు నేడు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అండతో దుష్ట కాం గ్రెస్ ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు రూపేణా ప్రజలపై రూ.10వేల కోట్ల భారాన్ని మోపిందని, కరెంటు సర్‌చార్జీల పేరుతో ప్రజలపై రూ.32వేల కోట్ల అదనపు భారాన్ని మోపారని షర్మిల వివరించారు.
మోడీ, పవన్‌లకు తెలీదా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ, పవన్ కల్యాణ్ లను తోడు తెచ్చుకుంటున్నాడని షర్మిల అన్నారు. మోడీకి, పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు తొమ్మిదేళ్ల దుష్టపాలన గురించి తెలియదా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు అని మోడీకి తెలి యదా.. పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వాసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసిన వ్యక్తి గురించి మోడీకి తెలియదా.. వ్యవసాయం దండగంటూ రైతుల కష్టాలు పట్టించుకోకుండా వారి ఆత్మహత్యలకు కారణమైన విషయం కూడా తెలియదా అంటూ ఘాటుగా విమర్శించారు. 1999నుంచి 2003వరకు అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీలకు అప్పుడు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలే దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా అని నిలదీశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీ అనే బోగస్ సంస్థకు 850 ఎకరాలను తక్కువ ధరకే ధారాదత్తం చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శిం చారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనవంతుడని తెహల్కా డాట్‌కామ్ చెప్పలేదా అని ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున ప్రచారానికి వెళ్లి చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన పవన్‌కల్యాణ్‌కు ఇప్పుడు ఆయన గొప్పవ్యక్తిగా కన్పిస్తున్నాడా అంటూ విమర్శించారు.
వైఎస్ ఒక్క రూపాయి కూడా పన్ను పెంచలేదు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూనే ఏనాడైనా ఒక్క రూపాయి కూడా ప్రజలపై చార్జీల భారాన్ని వేయలేదని షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీతో లక్షలాది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారని, ఫీజు పథకంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, రూ.12వేల కోట్ల రుణాల మాఫీ చేయించి రైతులను వైఎస్ ఆదుకున్నారని గుర్తు చేశా రు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించారని, 71లక్షల మంది వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని అన్నారు. జనభేరిలో ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూర్ల దేవీప్రియ, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు పెండ్యాల కృష్ణబాబు, జీఎస్ రావు, మద్దాల రాజేష్‌కుమార్, ఘంటా మురళీ, పార్టీ నాయకులు జి.శ్రీనివాసనాయుడు, పాశం రామకృష్ణ, చిన్నం గాంధీ, అలుగు ఆనంద్‌శేఖర్, మండవల్లి విజయసారధి, పోతన శేషు, పల్నాటి బాబ్జి, పరిమి హరిచరణ్, బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, మైపాల రామ్మోహన్‌రావు, పరిమి రాధాకృష్ణ పాల్గొన్నారు.