ప్రశాంతంగా ఎనిమిదో విడత పోలింగ్
ప్రశాంతంగా ఎనిమిదో విడత పోలింగ్
Published Wed, May 7 2014 4:54 PM | Last Updated on Thu, Jul 11 2019 6:22 PM
ఎనిమిదో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగింది. బుధవారం 7రాష్ట్రాల్లోని 64 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1737 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ, కేంద్ర మంత్రి బేణి ప్రసాద్ వర్మ, క్రికెటర్ మహ్మద్ కైఫ్, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, ఆర్ జే డీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవీల అదృష్టం ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. మొత్తం 18.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీమాంధ్రలో 25, యూపీలో 15, బీహార్‌లో 7, బెంగాల్‌లో 6 , హిమాచల్‌ప్రదేశ్‌లో 4, ఉత్తరాఖండ్‌లో 5, జమ్మూకాశ్మీర్‌లో 2 స్థానాలకు ఎనిమిదో దశలో ఎన్నికలు జరిగాయి.
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ, రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్, హరిద్వార్ లో యోగాగురువు రాందేవ్‌బాబు, మండిలో హిమాచల్ సీఎం వీరభద్ర సింగ్, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్వాతంత్ర్య భారతదేశంలో తొలి ఓటరుగా ఖ్యాతి గాంచి శ్యామ్ శరణ్ నేగి... హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయనకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.
Advertisement
Advertisement