గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ.. మహిళల సాధికారత గురించి మాట్లాడుతూ మరోవైపు మహిళల ఫోన్లు టాప్ చేయించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గుజరాత్లో స్నూపింగ్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అక్కడి సీఎం మహిళల ఫోన్లు టాప్ చేయిస్తారని, పోలీసులు ఆడాళ్ల వెంట పడతారని, ఆయన ముందు మహిళలను గౌరవించడం ఎలాగో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా సంక్షేమం శుద్ధశూన్యమని అన్నారు. ఛత్తీస్గఢ్లో 20 వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారని రాహుల్ ఆరోపించారు. మోడీ ఒక్క సభకు 10 కోట్లు ఖర్చుపెడుతున్నారని, పత్రికల్లో భారీ ప్రకటనలు ఇప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ డబ్బంతా ఆయన చెబుతున్న గుజరాత్ 'చాక్లెట్ అభివృద్ధి' నుంచే వచ్చిందని ఆరోపించారు. అక్కడి అభివృద్ధి కేవలం ఒక్క పారిశ్రామిక వేత్తకే మేలుచేసిందని ఆరోపించారు.
మోడీ.. ఆడాళ్ల ఫోన్లు టాప్ చేయించారు: రాహుల్
Published Tue, Apr 15 2014 4:38 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement
Advertisement