
సుద్దపల్లిలో 21న రాహుల్‌గాంధీ తొలి సభ
25న వరంగల్, హైదరాబాద్‌లలో సభలు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీల తెలంగాణలో ఎన్నికల పర్యటన ఖరారైంది. ఈనెల 21, 25 తేదీల్లో రాహుల్‌గాంధీ నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొని వెళ్లిన సోనియాగాంధీ ఈనెల 27న మెదక్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పోటీ చేస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సుద్దపల్లిలో ఈనెల 21న ఉదయం 11 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు రాహుల్‌గాంధీ తొలుత హాజరవుతారు. అనంతరం అదేరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే సభలో పాల్గొంటారు. మళ్లీ ఈనెల 25న వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.