రాజంపేట, న్యూస్‌లైన్: రాజంపేట తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహరెడ్డి నుంచి కోలుకోలేని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మదన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పసుపులేటి బ్రహ్మయ్యకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అప్పటి నుంచి టీడీపీలో మదన్ అంటీ అంటనట్లుగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ ఆయన పట్ల చంద్రబాబునాయుడు మొగ్గుచూపలేదు. మదన్‌తోపాటు బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు.
ఈనేపథ్యంలో ఇటీవల తన వర్గీయులతో మదన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మేడా రాకపోవడంలో అలక చెందారు. అనంతరం మేడా స్వయంగా వచ్చి సమావేశానికి గైర్హాజరు కావడానికి కారణాలు చెప్పుకున్నారు. దీంతో మదన్, మేడాల మధ్య సఖ్యత కుదిరిందని తెలుగుతమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం కూడా టీడీపీ అభ్యర్ధి మేడా మల్లికార్జునరెడ్డి వెంట పట్టణంలోని నారపురెడ్డిపల్లె ప్రచారంలో పాల్గొన్నారు. అయితే కండువా వేసుకోకుండానే ప్రచారంలో పాల్గొనడంతో అనుమానాలు తలెత్తాయి. అనుకున్నట్లుగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.
అనుచరులు ఎటువైపో..
రాజంపేట నియోజకవర్గంలో మదన్‌కు ప్రత్యేకంగా ఒక వర్గం ఉంది. టీడీపీ కొనసాగేందుకు ఇష్టం లేకపోయినా మదన్ వెంట ఇన్నాళ్లుగా నడుస్తూ వచ్చారు. మదన్ పార్టీకి రాజీనామా చేయడంతో ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మదన్ వెంట ఉన్న వర్గీయుల్లో అత్యధికంగా వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం వారు ఉన్నారు. వారంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలువవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రాజంపేట టీడీపీకి షాక్..!
Published Wed, Apr 30 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement