
ఇందూరును ప్రగతిపథంలో నడిపిస్తాం
జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం
నిజాంసాగర్ ప్రాజెక్టును ఆధునీకరిస్తాం
లెండి సహా పెండింగ్ పథకాలు పూర్తి
చెరుకు, పసుపు రైతులకు అండగా ఉంటాం
రూ.11 కోట్ల ఎర్రజొన్నల బకాయిలు ఇప్పిస్తాం
గల్ఫ్ బాధితులు, బీడి కార్మికులకు న్యాయం
నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు కాపాడుతాం
జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్‌కే..
సర్వేలు చెప్తున్నాయి... ప్రజలు ఆదరిస్తున్నారు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నిజామాబాద్ :
‘‘ఆంధ్ర పాలకుల పుణ్యమా అని వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉన్న ఇందూరు జిల్లా అభివృద్ధిలో వెనకబడింది. తెలంగాణ రాష్ర్టంలో నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తెస్తా’’ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచానికి పంచిన అంకాపూర్ అన్నదాతలు, ప్రపంచ ఉత్పత్తిలో 16 శాతం పసుపును ఎగుమతి చేసే రైతులున్న ఈ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇందూరును ఆదర్శ జిల్లాగా తీర్చదిద్దుతానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి నిజామాబాద్‌లో జీజీ కాలే జ్ సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ‘నిజామాబాద్ నగారా’ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న ఇందూరు జిల్లా రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తానన్నారు.
గతమెంతో ఘనం
నిజామాబాద్ జిల్లాలో ఉన్న రెండు అంశాలకు ప్రాముఖ్యత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టని, మూడు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిన ఘన త ఆనాటిదన్నారు. ఆసియాలో అతి పెద్దదైన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్వీర్యమైందన్నారు. ‘షుగర్ ఫ్యాక్టరీ అగమై చెరుకు మాయమైందని, నిజాంసాగర్ ఆగమై ఆయకట్టుకు నీళ్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తరలించి సింగూరు ప్రాజెక్టును జిల్లాకు అంకితం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తానని పేర్కొన్నారు. కౌలాస్‌నాల సామర్థ్యం పెంచి, ప్రాణహిత, లెండి తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి వ్యవసాయరంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు.
రైతుకు మద్దతు ధర
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప సుపు, చెరుకు రైతులకు అండగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. నిజాం షుగర్స్‌కు పూర్వవైభవం తెస్తామని, చెరుకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తద్వారా మెరుగైన వంగడాలు, మద్దతు ధర వచ్చేలా చూస్తామన్నారు. మోతె కేంద్రంగా పసుపు పరిశోధన కేంద్రం ఏ ర్పాటు చేసి రైతులకు మేలు చేస్తామన్నారు. ఆ ర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ ప్రాంతాల కు చెందిన రైతులకు రూ.11 కోట్ల ఎర్రజొన్న ల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుం టామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నా మ్‌కేవాస్తేగా మారిందని, టీఆర్‌ఎస్‌కు అధికా రం రాగానే అన్ని హంగులు కల్పిస్తామని హా మీ ఇచ్చారు. గ్రామంలో విధులు నిర్వహించే ఆశ వర్కర్లు, ఐకేపీ ఉద్యోగులకు జాబ్ చార్ట్ రూపొందించి గ్రామాలకు సరైన సేవలందిం చేలా చూస్తామన్నారు. జిల్లాలోని గిరిజన, కో య గూడాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే పూచీ తనదన్నారు. గల్ఫ్ బా ధితులు, బీడి కార్మికుల అభివృద్ధి కోసం ప్ర త్యేక చర్యలు తీసుకుంటామని, పోచంపల్లిలో ఏడు కుటుంబాలను ఆదుకునేందుకు భిక్షాట న చేసింది కూడ తానేనని కేసీఆర్ గుర్తు చేశా రు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఇందూరు పే రు ప్రఖ్యాతులను కాపాడుతానన్నారు.
అన్ని స్థానాలు మావే
తెలంగాణ జిల్లాలలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందడం ఖాయమని, ఇది తాను చెప్తున్నది కాదని, సర్వేలు సూచిస్తున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంపీకొకరికీ, ఎమ్మెల్యేకొక్కరికి ఓటేయడం సరికాదని, ఎమ్మెల్యే, ఎంపీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు. రాష్ర్టంలో తమ ప్రభుత్వ ం వచ్చినా, కేంద్రం మెడలు వంచి నిధులు తేవాలంటే మన ఎంపీలు ఢిల్లీలో ఉండాల్సిందేనన్నారు. జిల్లాలోని రెండు ఎంపీ, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రజల మధ్యన నిలిచి వారితో కలిసి ఉద్యమాలు చేసిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని అన్నారు. కేసీఆర్ ఆద్యంతం తన
ప్రసంగంలో కాంగ్రెస్, టీడీపీలపై విమర్శలు చేసి, జిల్లాపై వరాల జల్లు కురిపించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థులు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గో వర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, షకీల్ అహ్మద్, వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పోశెట్టి, సుజిత్‌కుమార్ ఠాగూర్, డీసీఎమ్మెస్ చైర్మన్ ముజిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.