సినిమా బాగున్నా ఒక్కోసారి ఆడదు: చిరంజీవి | Some times movie cannot run well, although movie is good, says Chiranjeevi | Sakshi
Sakshi News home page

సినిమా బాగున్నా ఒక్కోసారి ఆడదు: చిరంజీవి

Published Wed, Apr 16 2014 2:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సినిమా బాగున్నా ఒక్కోసారి ఆడదు: చిరంజీవి - Sakshi

సినిమా బాగున్నా ఒక్కోసారి ఆడదు: చిరంజీవి

కాంగ్రెస్ పరిస్థితీ అదే.. పార్టీ ముందున్నది ముళ్లదారే: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఫ్లాప్ అయిన సినిమా తో పోల్చారు ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి చిరంజీవి. ‘‘సినిమా సరిగ్గా ఆడలేకపోవచ్చు. అందుకు ఆ సినిమా బాగోలేకపోవడం కారణం కాదు. సినిమా బాగున్నా వేర్వేరు పరిస్థితుల వల్ల ఆడదు. అంత మాత్రాన నిరాశపడిపోం.
 
  సినిమాలు చేయడం మానేయం. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వెళ్తాం. అలరించి ఆదరణ చూరగొంటాం. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పు డు అంతే...’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. మంగళవారం ఇంది రాభవన్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ‘‘పార్టీ ముందున్నదంతా ముళ్లదారే. నల్లే రు మీద నడక కాదు. అయినా మనం ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ విజయానికి పనిచేయాలి..’’ అని పార్టీ నేతలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement