త్రిపురారం, న్యూస్‌లైన్ : ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని మాజీ మంత్రి, సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం త్రిపురారం మండలం లోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు తననుఆశ్వీరదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పర్చుతానని చెప్పారు. శ్రీశైలం లోలెవల్ కెనాల్ ద్వారా అభంగాపురం. గజలాపురం, పూసల పాడు గ్రామాల్లోని 7వేల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తానన్నారు. లిఫ్ట్‌లకు నిధు లు మంజూరయ్యాయని త్వరితగతిన పనులు చేయించి ఖరీఫ్‌లో సాగు నీరందస్తామన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. వృద్ధులకు, వికలాంగులు, వితంతువులకు రూ.1000 పింఛన్ వచ్చేవిధంగా చూస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
రానున్న ఎ న్నికల్లో తనును, నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీరుతుందన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితున్ని, ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీని చేస్తానన్న కేసీఆర్ ఇప్పడు మాట మార్చారన్నారు. ఎంపీ అభ్యర్థి గుత్తాసుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీకి తెలంగాణలో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, ధన్‌సింగ్ నాయక్, రామలింగయ్య యాదవ్, భరత్‌రెడ్డి, అనుముల నర్సిరెడ్డి, రాంచందర్ నాయక్, శ్రీనివాస్, రమణజానయ్య, నరేష్, శ్రీనివాస్ యాదవ్, పీబీ శ్రీని వాస్ యాదవ్, రవికుమార్ తదితరులున్నారు.
సోనియా రుణం తీర్చుకోవాలి
Published Sat, Apr 19 2014 1:52 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement