ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం మరోసారి తెలంగాణలో అడుగుపెట్టనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం మరోసారి తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్న సోనియా.. హెలికాప్టర్‌లో నేరుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభకు హాజరవుతారు. అక్కడ గంట సమయం వెచ్చిస్తారు. అనంతరం సాయంత్రం 5.30కు మెదక్ జిల్లా ఆందోల్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.