తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. 12 మంది అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఆదిలాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
ఖరాయిన వారి వివరాలు
నిజామాబాద్ - మధుయాష్కీ
జహీరాబాద్ - సురేష్ షెట్కర్
కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి - జి.వివేక్
వరంగల్ - రాజయ్య
మహబూబాబాద్ - బలరామ్ నాయక్
భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ - గుత్తా సుఖేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ - జైపాల్‌రెడ్డి
సికింద్రాబాద్ - అంజన్‌కుమార్ యాదవ్
మల్కాజ్‌గిరి - సర్వే సత్యనారాయణ