ఎస్సీ సిట్టింగ్ లపై కొర్రీ | Telangana PCC objects on sitting SC MLAs | Sakshi
Sakshi News home page

ఎస్సీ సిట్టింగ్ లపై కొర్రీ

Published Sun, Mar 23 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

Telangana PCC objects on sitting SC MLAs

 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలతోపాటు, ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టిక్కెట్లు ఖరారు చేసినట్టే. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు పంపింది. 23 మంది ఎస్సీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి స్థానాల్లో కొత్త వారిని నిలపాలని టీపీసీసీ ప్రతిపాదించిందించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల సిట్టింగ్‌లతో పాటు ఇతర పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నందున ఆఖరు నిమిషపు మార్పులు చేర్పులకూ అక్కడక్కడ ఆస్కారం లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రాథమికంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కరి పేరు నుంచి పది, పన్నెండు పేర్ల వరకు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక జాబితాను రూపొందించి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి  సమర్పించింది. టీపీసీసీ పంపిన జాబితాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను శాసనసభతోపాటు, పార్లమెంట్ అభ్యర్థులుగానూ సిఫారసు చేశారు.అయితే, టీపీసీసీ పంపిన జాబితాలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ (ఎస్‌సీ) పేరు గల్లంతయింది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, తెలంగాణ జేఏసీ నాయకుల పేర్లు  కూడా ఈ జాబితాలో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీలో లేనివారు, ఇతర పార్టీల్లో ఇంకా కొనసాగుతున్న  నాయకుల పేర్లనూ ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల దరఖాస్తులను కొద్దిరోజులుగా తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు పరిశీలించారు. ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీల ప్రతిపాదనలతోపాటు గాంధీభవన్‌కు నేరుగా దరఖాస్తు చేసుకున్న నేతల పేర్లనూ కలిపి క్రోడీకరించారు. వాటిలో అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ దామోదర రాజనరసింహలు ప్రత్యేకంగా సమావేశమై  షార్ట్‌లిస్ట్ చేసి కమిటీకి సమర్పించారు.స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శనివారం ఢిల్లీలో వార్‌రూంలో సమావేశమై రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలను సేకరించారు.రాత్రి 11 గంటలకు ఈ సమావేశం ముగిసింది.కాగా ఈ సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డీ.శ్రీధర్‌బాబు,మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హాజరు కాలేదు. దీంతో వారిని రేపు ఉదయం 11గంటలకు జరిగే సమావేశానికి ఆహ్వానించారు.వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాక  జాబితాలోని పేర్లను వడబోసి రెండుమూడు రోజుల్లో ఒకే పేరుతో తుది జాబితాను రూపొందించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదానికి పంపుతారు. ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా, సీపీఐ,న్యూడెమోక్రసీ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందని ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఈ ప్రక్రియనంతా నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 23 మంది ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలపాలని టీపీసీసీ నివేదించినట్టు తెలిసింది. పొన్నాల,దామోదర,ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ఈమేరకు నివేదించినట్టు తెలిసింది.  2009 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించిన అధిష్టానం....ఈసారి తెలంగాణ, సీమాంధ్ర జాబితాలను వేర్వేరుగా రూపొందిస్తోంది. అయితే తొలుత తెలంగాణ జాబితాను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఒకేసారి 119 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారా? లేక దశల వారీగా వెల్లడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేరును నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ స్థానాలకు కూడా సిఫారసు చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేరును అంబర్‌పేటకు సూచించగా....సనత్‌నగర్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు పురూరవరెడ్డిని ప్రతిపాదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, పి.సుదర్శన్‌రెడ్డి పేర్లను పార్లమెంట్ అభ్యర్థులుగానూ సిఫారసు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు వైశాలి పేర్లను జనగాం అసెంబ్లీతోపాటు, భువనగిరి పార్లమెంట్‌కు ప్రతిపాదించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ డి.శ్రీధర్‌బాబు, మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, జానారెడ్డి సహా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒకే ఒక్క పేరును మాత్రమే ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి, తెలంగాణ రాజకీయ జేఏసీ కో-ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, వేములవాడ ఆది శ్రీనివాస్ తదితర నేతలు ఇంకా కాంగ్రెస్‌లో చేరనప్పటికీ వారిపేర్లను టీపీసీసీ సిఫారసు చేయడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదరరెడ్డి వంటి ప్రముఖ నాయకులంతా తమతోపాటు కుటుంబ సభ్యుల పేర్లను కూడా టీపీసీసీ జాబితాలో చేర్పించినప్పటికీ కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలం పనిచేసి మరణించిన ఉప్పునూతల పురుషోత్తమ్‌రెడ్డి(చివరి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు) కుమారుడు ప్రవీణ్‌రెడ్డి పేరును మాత్రం విస్మరించారు. భువనగిరి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న ప్రవీణ్‌రెడ్డి టీపీసీసీ, ఏఐసీసీల చుట్టూ తిరుగుతున్నారు.

 ఆదిలాబాద్ జిల్లా: సిర్పూర్: పి.రాజ్యలక్ష్మి, పి.రవీందర్‌రావు, కె.సురేఖ, జి.మాలతి, ఇస్మాయిల్ అహ్మద్ జుల్ఫికర్, సుల్తాన్ అహ్మద్, జి.రామయ్య, చెన్నూరు: డి.శ్రీనివాస్, విద్యావర్థిని, ఎం.మల్లయ్య, అజ్మీరా హరినాయక్, పాతి శ్రీనివాస్, సొతుకు సంజీవరావు, మామిడి నారాయణ, పి.సంజీవ్, టి.రాజేశ్‌కుమార్, బెల్లంపల్లి: చిలుములు శంకర్, సి.దుర్గాభవాని, కె.హేమలత, శ్రీదేవి, రాజేశ్వరరావు, రవికుమార్, డి.నర్సయ్య, మంచిర్యాల: అరవింద్‌రెడ్డి గడ్డం(సిట్టింగ్), కె.ప్రేంసాగర్‌రావు, డేగ శ్రీనివాస్, మెండె రాజమౌళి, ఆసిఫాబాద్: ఆత్రం సక్కు(సిట్టింగ్), రమేశ్, ఆడె రమేశ్, ఖానాపూర్: అజ్మీరా హరినాయక్, జాదవ్ మాణిక్‌రావు నాయక్, ఎల్.భక్షినాయక్, రామకృష్ణనాయక్, భూక్యారమేశ్, సి.హెచ్.భరత్, రామకృష్ణ జాదవ్, భరత్ చౌహన్, ఆదిలాబాద్: జి.సుజాత, భార్గవ్ దేశ్‌పాండే, సి.రాంచంద్రారెడ్డి, వై.నర్సింగరావు, ఎ.సంజీవ్‌రెడ్డి, సిరాజ్ అమీనా ఖాన్, బోథ్: జాదవ్ అనిల్, ఎ.మహేందర్, కె.కోటేశ్వర్, నరేశ్‌జాదవ్, ఆడె పంచపుల, నిర్మల్: ఎ.మహేశ్వర్‌రెడ్డి(సిట్టింగ్), టి.జగన్మోహన్‌రెడ్డి, ఎ.రాజేశ్వర్, ముధోల్: జి.విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్, జి.మురళీగౌడ్.

 నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్: కె.ఆర్.సురేశ్‌రెడ్డి, మహేష్‌గౌడ్, ఎ.బి.శ్రీనివాస్, బోధన్: పి.సుదర్శన్‌రెడ్డి(సిట్టింగ్), పాషా మొయినుద్దీన్. జుక్కల్: డి.రాజేశ్వరరావు, జి.గంగాధర్, అరుణతార, ఎస్.గంగారాం. బాన్సువాడ: శ్రీనివాస్‌గౌడ్, ఆర్.వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజ్, ఎల్లారెడ్డి: ఆకుల శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, జమునా రాథోడ్, బి.జనార్దన్‌గౌడ్, టి.సుభాష్. కామారెడ్డి: షబ్బీర్‌అలీ, ఎడ్ల రాజిరెడ్డి, నిజామాబాద్ అర్బన్: డి.శ్రీనివాస్, తాహెర్‌బిన్, డి.సంజయ్, మహేశ్ గౌడ్, బి.మోహన్‌రెడ్డి. నిజామాబాద్ రూరల్ : డి.శ్రీనివాస్, ఆకుల లలిత, డి.సంజయ్, మహేశ్ గౌడ్. బాల్కొండ: ఇ.అనిల్(సిట్టింగ్), కె.ఆర్.సురేష్‌రెడ్డి, ప్రేమలతా అగర్వాల్.

 కరీంనగర్ జిల్లా: కోరుట్ల: డాక్టర్ జె.ఎన్.వెంకట్, కొమిరెడ్డి రాములు. జగిత్యాల: టి.జీవన్‌రెడ్డి, సుద్దాల దేవయ్య (ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే) ధర్మపురి: ఎ.లక్ష్మణ్‌కుమార్ రామగుండం: గంటా సత్యనారాయణరెడ్డి, జి.వెంకట్రామిరెడ్డి, జి.సత్యనారాయణ, హెచ్.వేణుగోపాల్‌రావు, సలీంపాషా, కౌశిక్ హరి, కోలేటి దామోదర్, గుర్రం శ్రీనివాస్‌రెడ్డి మంథని: డి.శ్రీధర్‌బాబు(సిట్టింగ్) పెద్దపల్లి: జి.ముకుందరెడ్డి, భానుప్రసాద్‌రావు, డాక్టర్ షెట్టి, బి.రాజమల్లు, ఇ.కొమరయ్య, దానయ్య, అనయ్య గౌడ్, దేవనంది ధర్మయ్య కరీంనగర్: సి.లక్ష్మీనరసింహరావు, బొమ్మ వెంకన్న, వి.జగపతిరావు, వి.కృష్ణమోహన్‌రావు, నేరెళ్ల శారద, వి.జగపతిరావు, జి.మహేందర్‌రావు, బి.శ్రీరాంచక్రవర్తి, రాజనాల శ్రీహరి చొప్పదండి: సుద్దాల దేవయ్య, గజ్జల కాంతం, నాగి శేఖర్, ఎం.సత్యం, జి.రాంచందర్, రవీంద్రనాథ్, భీంరావు, కె.రామకృష్ణ వేములవాడ: ఎ.మనోహర్‌రెడ్డి, నాగం కుమార్, ఆది శ్రీనివాస్, పాపారావు, రవీందర్‌గౌడ్, కె.రవీందర్‌రావు, ఎ.రమేశ్, జలందర్ సిరిసిల్ల: కె.రవీందర్‌రావు, జి.మంజుల, కటకం మృత్యుంజయం, కె.కె.మహేందర్‌రెడ్డి, జి.జ్యోతికిరణ్, రేగులపాటి పాపారావు, కె.రేఖ,కె. సత్యనారాయణగౌడ్ మానకొండూరు: ఆరేపల్లి మోహన్(సిట్టింగ్) హుజురాబాద్: కె. సుదర్శన్‌రెడ్డి, సత్యనారాయణ గౌడ్, కౌశిక్‌రెడ్డి, సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పి.రవీందర్‌రెడ్డి, వి.కృష్ణమోహనరావు, ఈ.భీమారావు హుస్నాబాద్: ఎ.ప్రవీణ్‌రెడ్డి(సిట్టింగ్), బొమ్మ వెంకటేశ్వర్లు.

 మెదక్ జిల్లా: సిద్దిపేట: జి.మహేందర్‌రావు, గొడుగు రఘు, టి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.వి.రవీంద్రనాథ్, గూడూరి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్ మెదక్: పి.శశిధర్‌రెడ్డి, సుప్రభాత్, ఎస్.జె.శ్రీనివాస్‌రావు, పి.రాంచందర్‌గౌడ్, ఎల్.ప్రభాకర్‌వర్మ నారాయణఖేడ్: పి.కిష్టారెడ్డి ఆందోల్: దామోదర రాజనర్సింహ (సిట్టింగ్) నర్సాపూర్: వి.సునీతాలక్ష్మారెడ్డి జహీరాబాద్: జె.గీతారెడ్డి (సిట్టింగ్) కె.శామ్యూల్ సంగారెడ్డి: టి.జయప్రకాశ్‌రెడ్డి(సిట్టింగ్), బి.రాజేశ్వర్‌దేశ్‌పాండే, పి.మమతాగౌడ్, సాజిద్‌పాషా, ఎ.రాంగౌడ్ పటాన్‌చెరు: టి.న ందీశ్వర్‌గౌడ్(సిట్టింగ్), వి.భూపాల్‌రెడ్డి, ఎం.శంకర్‌యాదవ్, బి.పుష్పానగేశ్, కె.బాల్‌రెడ్డి, సాజిద్ పాషా దుబ్బాక: సి.హెచ్.ముత్యంరెడ్డి(సిట్టింగ్), గాల్‌రెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి, ఉమాదేవి, బండి నర్సాగౌడ్, బి.మనోహర్‌రావు, జి.కృష్ణారెడ్డి గజ్వేల్: కె.లింగం, టి.నర్సారెడ్డి(సిట్టింగ్).

 రంగారెడ్డి జిల్లా: మేడ్చల్: కె.లక్ష్మారెడ్డి(సిట్టింగ్), పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.నవీన్‌చందర్, పి.నర్సింహారెడ్డి, తలారి యాదగరి యాదవ్ మల్కాజిగిరి: ఎ.రాజేందర్(సిట్టింగ్), శ్రీధర్, జి.సుమతీదేవి, సురేష్‌యాదవ్, జె.అమరనాథ్‌గౌడ్, బి.మల్లికార్జున్‌యాదవ్, ఎన్.శ్రీధర్ కుత్బుల్లాపూర్: కూన శ్రీశైలం గౌడ్(సిట్టింగ్), కె.ఎం.ప్రతాప్, హనుమంతరెడ్డి, ఎన్.ప్రభాకర్‌గౌడ్, కె.నీరజ రెడ్డి కూకట్‌పల్లి: కాసాని జ్ఞానేశ్వర్, కాట్రగడ్డ ప్రసూన సహా 25 పేర్లు పరిశీలనకు వచ్చాయి.  ఉప్పల్: రాజిరెడ్డి(సిట్టింగ్), బండ కార్తీక చంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, రాగడి లక్ష్మణ్‌రెడ్డి, పి.ప్రభాకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, ఇబ్రహీంపట్నం: కైమ మల్లేష్, శేఖర్‌రెడ్డి, సంధ్యారాణి, పి.లక్ష్మీపతిగౌడ్, ఎస్.రజితారెడ్డి, ఎం.రంగారెడ్డి, ఎం.ఎ.అన్సారీ, బండారి మోహన్‌రెడ్డి, అర్రబోలు లక్ష్మారెడ్డి ఎల్బీనగర్: డి.సుధీర్‌రెడ్డి(సిట్టింగ్), రాముగౌడ్, సామకృష్ణారెడ్డి మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి(సిట్టింగ్), సామ గణేష్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి, కోదండరెడ్డి, రాజేంద్రనగర్: సబితాఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, రణధీర్‌రెడ్డి, ఎల్లయ్య, వేణుగౌడ్, జనార్దన్‌రెడ్డి, పుష్వంత్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్ శేరిలింగంపల్లి: భిక్షపతియాదవ్(సిట్టింగ్), జగదీశ్వర్‌గౌడ్, ఎం.విమల్‌కుమార్, కె.యాదయ్య, ఆర్.సుజాతరెడ్డి, ఆర్.నాగేందర్‌యాదవ్ చేవెళ్ల: బి.కైలాస్, ఎ.కృష్ణ, వెంకటస్వామి, కె.యాదయ్య, సదాలక్ష్మి, ఎం.విమల్, మైలారం సులోచన, జశ్వంత్ కుమార్, చింతల యాదగిరి, జి.ఎస్.రావు పరిగి: టి.రామ్మోహన్‌రెడ్డి, కె.రాంరెడ్డి, కె.వెంకటేశం వికారాబాద్: గడ్డం ప్రసాద్‌రావు(సిట్టింగ్), ఎం.చంద్రశేఖర్ తాండూరు: ఎం.రమేశ్, విశ్వనాథ్‌గౌడ్, కె.యాదయ్య, ఎ.కృష్ణ, వెంకటస్వామి, నారాయణరావు.

 హైదరాబాద్ జిల్లా: ముషీరాబాద్: మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బండ కార్తీకరెడ్డి, అనిల్‌యాదవ్, ఎం.కోదండరెడ్డి, తదితరులతో పాటు మొత్తం 25 మంది పేర్లు వచ్చాయి. మలక్‌పేట: కిషన్, అల్తాఫ్ మహ్మద్, ఎం.ఎం.కె.ఖాన్, జి.వెంకటేశ్వర్‌రెడ్డి అంబర్‌పేట్: వి.హనుమంతరావు(ఎంపీ రాజ్యసభ), దిడ్డి రాంబాబు, ఎ.ఉదయ్‌కుమార్, జి.రమేశ్, జి.శ్రీనివాస్‌గౌడ్, జి.ఇంద్రారావు, మక్బూల్ షరీఫ్, కె.సంజీవ్‌యాదవ్ ఖైరతాబాద్: డి.నాగేందర్(సిట్టింగ్), ఎం.డి.జాంగీర్, ఎం.రాజగోపాల్ వినోద్‌రెడ్డి జూబ్లీహిల్స్: విష్ణువర్దన్‌రెడ్డి(సిట్టింగ్), ఇందుకూరి నిర్మలాదేవి, ఎం.షరీఫ్, అక్బర్ అయూబ్ సనత్‌నగర్: ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తన కుమారుడు పురూరవ రెడ్డి పేరుప్రతిపాదించారు. నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్‌ఖాన్, మెట్టు సాయి, ఎం.అశోక్, కొండల్‌రావు, కార్వాన్: జె.రవీందర్, పి.శోభారాణి గోషామహల్: ముఖేష్‌గౌడ్(సిట్టింగ్), ఆయన కుమారుడు విక్రంగౌడ్, ప్రేమ్‌లాల్ చార్మినార్: పి.లక్ష్మణ్‌రావు, నాగజ్యోతి, ఆర్.ప్రభాకర్‌రెడ్డి, మీర్జా అస్కర్ అలీ బేగ్, మూసా ఖాసిం, సత్యనారాయణ చాంద్రాయణగుట్ట: జె.రాజేందర్, ఎం.కృష్ణ తదితర 11 మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. యాకుత్‌పుర: అరుణ్‌ప్రసాద్ ఠాకూర్, రేణు, పి.రాజేందర్, అరుణ్‌ప్రసాద్, రాజేందర్‌రాజు, ఆర్.మల్లేశం, రంగాశ్రీకాంత్, ఆర్.సత్యనారాయణ బహదూర్‌పుర: సయ్యద్ అబ్దుల్ సమి, ఎస్.మంజుల, కె.రవిరాజు తదితర 10 పేర్లు వచ్చాయి. సికింద్రాబాద్: జయసుధ(సిట్టింగ్), ఉమాదేవి, బండ కార్తీక చంద్రారెడ్డి, సంతోష్, పి.లక్ష్మణ్‌గౌడ్, పి.కృష్ణ, కృష్ణకుమార్‌గౌడ్, మేరీ రవీంద్రనాథ్, అమర్‌నాథ్‌గౌడ్, కృష్ణగౌడ్, ఎం.ప్రవీణ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్: డాక్టర్ శంకర్‌రావు(సిట్టింగ్), సర్వే సత్యనారాయణ(గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సిఫారసు), సుస్మిత, ముప్పిడి గోపాల్.

 మహబూబ్‌నగర్ జిల్లా: కొడంగల్: డి.విఠల్‌రావు(మాజీ ఎంపీ), గురునాథ్‌రెడ్డి, ఎస్.కృష్ణ, మల్కిరెడ్డి, ఎం.డి.సలీం, ఎం.కృష్ణ, ఎ.లక్ష్మారెడ్డి నారాయణపేట: డి.రాజేందర్‌రెడ్డి(డిప్యూటీ తహసీల్దార్), రవీందర్‌రెడ్డి, పులి అంజనమ్మ, నర్సింహారెడ్డి, సాయిబాబా, కె.వీరారెడ్డి, బి.వెంకట్రామిరెడ్డి, కృష్ణ మహబూబ్‌నగర్: ఒబేదుల్లా కొత్వాల్, బి.వెంకట్రామిరెడ్డి, ముత్యాల ప్రకాశ్, ఎస్.జగదీశ్వర్‌రెడ్డి, పులి అంజమ్మ, ఖలీద్హ్రమాన్, టి.రేవతిగౌడ్, కె.విజయ్‌కుమార్ జడ్చర్ల: మల్లు రవి, రమేశ్‌రెడ్డి, రాంప్రసాద్, రమేశ్‌రెడ్డి, సాదు వెంకట్‌రెడ్డి, టి.రేవతిగౌడ్, ఎం.కె.రహమాన్, ఎల్.కృష్ణయ్య దేవరకద్ర: జి.బాలకిష్టయ్య, బి.పవన్‌రెడ్డి, విశ్వేశ్వర్, ప్రదీప్‌గౌడ్, కె.శ్రీనివాసులు, స్వర్ణసుధాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, పొగాకు విశ్వేశ్వర్ మక్తల్: చింతం రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, శ్రీహరి, ఎ.సత్యనారాయణ, ఎం.జలంధర్‌రెడ్డి వనపర్తి: డాక్టర్ జి.చిన్నారెడ్డి గద్వాల: డి.కె.అరుణ ఆలంపూర్: వి.ఎం.అబ్రహం(సిట్టింగ్), ఎస్.సంపత్, ఆంజనేయులు, ఎ.ప్రకాశం నాగర్‌కర్నూలు: కె.దామోదర్‌రెడ్డి, దిలీపాచారి, మోహన్‌గౌడ్, కె.రాజేశ్ అచ్చంపేట: డాక్టర్ వంశీకృష్ణ, కృష్ణయ్య, డాక్టర్ అనురాధ, కె.రామనాథం కల్వకుర్తి: వంశీచందర్‌రెడ్డి(యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు), ఎస్.రామిరెడ్డి, జె.చిత్తరంజన్‌దాస్, ఆర్.నార్యానాయక్ షాద్‌నగర్: ప్రతాప్‌రెడ్డి(సిట్టింగ్), కె.శంకరయ్య, ఎల్లారెడ్డి, నరేందర్, పి.సుస్మిత, కాడేపల్లి శ్రీనివాస్ కొల్లాపూర్: విష్ణువర్ధన్‌రెడ్డి, రామ్మూర్తి నాయుడు, హర్షవర్దన్‌రెడ్డి, జగన్‌మోహన్‌దాస్, కమలేశ్వరి, కేతూరి వెంకటేశ్, మేడిపల్లి సురేష్‌రెడ్డి, టి.రేవతిగౌడ్.

 నల్లగొండ జిల్లా: దేవరకొండ: ఎ.లక్ష్మీనాయక్, బాలూ నాయక్, స్కైలాబ్‌నాయక్, జగన్‌లాల్ నాయక్, రమేశ్‌నాయక్ నాగార్జునసాగర్: కె.జానారెడ్డి(సిట్టింగ్), ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ: ఆర్.రమేశ్, టి.దేవేందర్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, కె.రఘువీర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, పి.రామలింగయ్యయాదవ్, టి.విజయసింహారెడ్డి, కె.చంద్రశేఖర్‌రెడ్డి, కె.జ్యోతిరెడ్డి, చింతల సోమన్న హుజూర్‌నగర్: ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(సిట్టింగ్) కోదాడ: నల్లమాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట: ఆర్.దామోదర్‌రెడ్డి(సిట్టింగ్), వై.రాము, వేదాసు వెంకయ్య నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), జి.మోహన్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ మునుగోడు: పాల్వాయి స్రవంతి, పున్నా కైలాస్ నేత(ఓయూ జేఏసీ), బి.లింగయ్యయాదవ్, రాపోలు జె.ప్రకాష్, అబ్దుల్ హఫీజ్‌ఖాన్, సుంకర మల్లేష్‌గౌడ్, గర్దాసు బాలయ్య, లింగం యాదవ్, చింతల సోమన్న, ఎ.లక్ష్మారెడ్డి భువనగిరి: చింతల వెంకటేశ్వరరెడ్డి, లింగంయాదవ్, పున్నా రామలింగం, కుంబం అనిల్, కల్పన, బి.యాదగిరి, వెంకట శ్రీనివాసరావు, డాక్టర్ వి.ప్రజోత్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్పనా కుమారి, పొత్నాక ప్రమోద్, నకిరేకల్: చిరుమర్తి లింగయ్య(సిట్టింగ్), వే దాసు వెంకయ్య, డి.రాజేశ్వర్, కె.మల్లయ్య, అరున్ సికిలిం, జి.జనార్దన్, పోలేని యాదగిరి, నేతి విద్యాసాగర్, తుంగతుర్తి: కె.పరమేశ్వర్, కరణ్ జయరాజ్(జేఏసీ), ఎన్.ప్రీతమ్, ఎం.అరుణ్. ఆర్.జగన్‌లాల్, ఎ.ప్రభాకర్, దోసపాటి గోపాల్, జి.నర్సయ్య, ఎ.జ్ఞానసుందర్, నగ రగిరి ప్రీతమ్, బోడ రాములు, పోలేని యాదగిరి ఆలేరు: బి.భిక్షమయ్యగౌడ్(సిట్టింగ్), మూర్తి ఐలయ్య, వి.ప్రజత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎ.సంజీవరెడ్డి, పి.శ్రీనివాస్‌గౌడ్.

 వరంగల్ జిల్లా: జనగాం: పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల వైశాలి స్టేషన్ ఘన్‌పూర్: విజయరామారావు, బి.ఆరోగ్యం, ఇంద్రా, బి.రవీందర్, రాజమౌళి, ఆర్.ప్రతాప్, కీసర దిలీప్‌రెడ్డి, చెరుపూరి చిరంజీవి పాలకుర్తి: ఆర్.నర్సింహరెడ్డి, అశోక్‌గౌడ్, డి.శ్రీనివాస్‌రావు, రఘురాంరెడ్డి, భరత్‌చంద్రారెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, శ్రీరాంభద్రయ్య, జి.నర్సయ్య డోర్నకల్: డి.ఎస్.రెడ్యానాయక్, రాంలాల్, రజనీకాంత్‌నాయక్ మహబూబాబాద్: ఎం.కవిత(సిట్టింగ్), డి.పోలమ్మ, జి.సుచిత్ర, ఎ.ర జనీకాంత్‌నాయక్ నర్సంపేట: డి.మాధవరెడ్డి, బి.యాదగిరి, సత్యనారాయణగౌడ్ పరకాల: రాంభద్రయ్య, సాంబారి సమ్మారావు, మంద రమేశ్, వెంకటరామిరెడ్డి దేశాయ్ వరంగల్ వెస్ట్: రాజేందర్‌రెడ్డి, స్వర్ణ, పి.వి.రాజేశ్వరరావు, డి.ప్రభాకర్‌రెడ్డి, విద్యాసాగర్, హరిరమాదేవి, జి.రమాకాంత్‌రెడ్డి, పి.రామేశ్వర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఆనంద్‌కుమార్, నరేందర్‌రెడ్డి, పి.నరోత్తంరెడ్డి, కె.నరేందర్‌రెడ్డి, జి.ప్రకాశ్‌రెడ్డి వరంగల్ ఈస్ట్: బసవరాజు సారయ్య(సిట్టింగ్)తో పాటు మరో ఐదు పేర్లు పరిశీలనకు వచ్చాయి వర్ధన్నపేట: బి.దేవయ్య, ఆనంద్, బక్కా జడ్సన్, టి.విజయ, ఎన్.శ్రీనివాస్, టి.సూర్యనారాయణ (ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కె. శ్రీధర్ పేరు ప్రతిపాదించలేదు) భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి(సిట్టింగ్), జి.మల్లేశం ములుగు: పి.వీరయ్య, సి.సత్యం, ఎ.బలరాం, ఎ.రజనీకాంత్‌నాయక్, జైరాంనాయక్, ప్రీతంకుమార్, మణీశ్వరరావు.

 ఖమ్మం జిల్లా: పినపాక: జి.సుబ్బారావు, కె.భద్రయ్య, ఇల్లెందు: డాక్టర్ డి.టి.నాయక్, చేపూరి రవి, మంగీలాల్, మిఠియా నాయక్, బాలాజీరావు, వెంకట్రాం, తేజావత్‌రూపాభాయి, పాపానాయక్, తేజావన్ మదన్‌సింగ్, కొర్రం కనకయ్య ఖమ్మం: పువ్వాడ అజయ్, యూనస్ సుల్తాన్, రాపర్తి రంగారావు సహా మొత్తం 12 పేర్లు పరిశీలనకు వచ్చాయి. పాలేరు: రాంరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), ఎ.శ్రీరాంయాదవ్, ఆర్.మాధవిరెడ్డి, నాగేశ్వరరావు, బి.హనుమంతురావు, నరేశ్‌రెడ్డి మధిర: మల్లు భట్టివిక్రమార్క(సిట్టింగ్), ఎన్.కుటుంబరావు వైరా: భూక్యా రాంజీ, బానోతు

ఎస్సీ సిట్టింగ లపై కొర్రీ

 ఖమ్మం జిల్లా: పినపాక: జి.సుబ్బారావు, కె.భద్రయ్య, ఇల్లెందు: డాక్టర్ డి.టి.నాయక్, చేపూరి రవి, మంగీలాల్, మిఠియా నాయక్, బాలాజీరావు, వెంకట్రాం, తేజావత్‌రూపాభాయి, పాపానాయక్, తేజావన్ మదన్‌సింగ్, కొర్రం కనకయ్య ఖమ్మం: పువ్వాడ అజయ్, యూనస్ సుల్తాన్, రాపర్తి రంగారావు సహా మొత్తం 12 పేర్లు పరిశీలనకు వచ్చాయి. పాలేరు: రాంరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), ఎ.శ్రీరాంయాదవ్, ఆర్.మాధవిరెడ్డి, నాగేశ్వరరావు, బి.హనుమంతురావు, నరేశ్‌రెడ్డి మధిర: మల్లు భట్టివిక్రమార్క(సిట్టింగ్), ఎన్.కుటుంబరావు వైరా: భూక్యా రాంజీ, బానోతు చందూనాయక్, రాములు నాయక్. పోరిక లక్ష్మీ భాయి, ఎ.శ్రీమన్నారాయణ, బి.విజయశాంతి, ధన్‌రాజ్‌రాథోడ్, మదన్‌సింగ్, రామ్మూర్తినాయక్, నాగునాయక్ సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, కె.వెంకటేశ్, మమతారావు, గురుమూర్తి, మానవతారాయ్, సోమచంద్రశేఖర్ కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు, గోనెల విజయలక్ష్మి, లక్కినేని సురేందర్, బోయినపల్లి కృష్ణమూర్తి అశ్వరావుపేట:   మిత్రసేన(సిట్టింగ్), ఎస్.నాగమణి, భద్రాచలం:  కుంజా సత్యవతి(సిట్టింగ్), పి.రామకృష్ణ, పి.జ్యోతిర్మయి.

చందూనాయక్, రాములు నాయక్. పోరిక లక్ష్మీ భాయి, ఎ.శ్రీమన్నారాయణ, బి.విజయశాంతి, ధన్‌రాజ్‌రాథోడ్, మదన్‌సింగ్, రామ్మూర్తినాయక్, నాగునాయక్ సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, కె.వెంకటేశ్, మమతారావు, గురుమూర్తి, మానవతారాయ్, సోమచంద్రశేఖర్ కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు, గోనెల విజయలక్ష్మి, లక్కినేని సురేందర్, బోయినపల్లి కృష్ణమూర్తి అశ్వరావుపేట:   మిత్రసేన(సిట్టింగ్), ఎస్.నాగమణి, భద్రాచలం:  కుంజా సత్యవతి(సిట్టింగ్), పి.రామకృష్ణ, పి.జ్యోతిర్మయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement