ఓటరు సహాయ కేంద్రాలను వినియోగించుకోవాలి | voter help centers be utilized | Sakshi
Sakshi News home page

ఓటరు సహాయ కేంద్రాలను వినియోగించుకోవాలి

Published Thu, May 1 2014 3:59 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

voter help centers be utilized

కలెక్టర్ సౌరభ్‌గౌర్
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటరు సహాయ కేంద్రాలను ప్రారంభించామని, వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ కోరారు. పట్టణంలోని న్యూకాలనీలో గల డైమండ్ పార్‌‌క వద్ద గలక్రాంతి మాన్సన్ వద్ద ఏర్పాటు చేసిన ఓటరు సహాయ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ జిల్లాలో ముఖ్యంగా మున్సిపాల్టీల్లో జన కూడలి ప్రదేశాలలో ఈ ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 పట్టణంలో 36 వార్డులలో వీటిని ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటరు సహాయక కేంద్రం వద్దకు ఓటరు వెళ్లి తమ చిరునామా తెలియజేస్తే ఓటరు జాబితాలో వారి పేర్లు ఎక్కడ ఉన్నాయి, ఏ పోలింగు కేంద్రం తదితర వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి అపార్టుమెంట్ వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. జేసీ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగు శాతం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, పురపాలక అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement