చట్టానికి లోబడి రామమందిర నిర్మాణం | will prioritise ram mandir in legal framework, says bjp in manifesto | Sakshi
Sakshi News home page

చట్టానికి లోబడి రామమందిర నిర్మాణం

Published Mon, Apr 7 2014 10:41 AM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

చట్టానికి లోబడి రామమందిర నిర్మాణం - Sakshi

చట్టానికి లోబడి రామమందిర నిర్మాణం

చట్టానికి లోబడి రామమందిర నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ తెలిపింది. రాబోయే సార్వత్రి ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోను కమలనాథులు సోమవారం ఉదయం ఢిల్లీలో విడుదల చేశారు. పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీల సమక్షంలో ఈ మేనిఫెస్టోను సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి విడుదల చేశారు.

దేశ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని, అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పరిపాలనలో పారదర్శకత తీసుకొస్తామని, అందరికీ ఆహార భద్రత కల్పిస్తామని కూడా అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలను తొలగిస్తామని, దేశంలో మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని అన్నారు. న్యాయ, ఎన్నికల, పోలీసు సంస్కరణలు తీసుకొస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement