హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం: విజయమ్మ
సాక్షి, విజయవాడ: ‘‘హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి అంతా తన సృష్టేనని టీడీపీ అధినేత చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆయన నిక్కర్లు వేసుకున్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలో ఐదో స్థానంలో ఉంది. 1956 సంవత్సరంలోనే హైదరాబాద్.. అభివృద్ధి చెం దిన ప్రాంతాల జాబితాలో ఉంది. రాష్ట్రంలో ఐటీ రంగం చంద్రబాబు రాక ముందు మూడో స్థానంలో ఉండగా, ఆయన వచ్చాక ఐదో స్థానానికి పడిపోయింది. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చంద్రబాబు హయాంలో తొమ్మిది శాతం ఉంటే దివంగత వైఎస్సార్ హయాంలో 14శాతానికి పెరిగాయి.
బాబు హయాంలో రాష్ట్రంలో 50వేల మందికి సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు వస్తే దివంగత వైఎస్సార్ హయాంలో 2.5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. మరి చంద్రబాబు నాయుడు తాను చేశానని చెబుతున్న అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమం లో భాగంగా సోమవారం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని 22గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు.
చంద్రబాబు నిక్కర్లు వేసుకున్నప్పడే.. హైదరాబాద్ అభివృద్ధి: విజయమ్మ
Published Tue, Apr 15 2014 3:25 AM | Last Updated on Fri, Sep 7 2018 2:12 PM
Advertisement