వెన్నుపోటు.. పన్నుపోటు: వైఎస్ విజయమ్మ | Ys Vijayamma takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు.. పన్నుపోటు: వైఎస్ విజయమ్మ

Published Thu, Mar 27 2014 2:10 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Ys Vijayamma takes on Chandrababu Naidu

టీడీపీ అధినేత చంద్రబాబు ఘనత ఇదే: విజయమ్మ
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ప్రజలు నమ్మకంతో ఎన్టీఆర్‌కు అధికారం అప్పగిస్తే వెన్నుపోటుతో ఆ అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడు తర్వా త ప్రజలకు వరుసగా పన్నుపోటు పొడిచారు. హార్స్‌పవర్ మోటార్లకు రూ.50తో విద్యుత్ సరఫరా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయిస్తే.. చంద్రబాబు దాన్ని రూ.600కు పెంచారు. కిలో రూ.2 బియ్యాన్ని ఐదు రూపాయల పావలా చేశారు. గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు తెరిచారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని ప్రజలు ధర్నాలు చేస్తే బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపించారు.
 
 తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు పాలన చూసిన ప్రజానీకం అందుకే ఆయన్ను ఇన్నేళ్లపాటు అధికారానికి దూరం గా ఉంచి యావజ్జీవ శిక్ష విధించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. మంగళవారం ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన విజయమ్మ బుధవారం సా యంత్రం వైఎస్సార్ జిల్లా రాయచోటి మున్సిపాలిటి పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘నాలుగున్నర సంవత్సరాల కాలం మనం పడ్డ కష్టాలకు చరమగీతం పాడే రోజు అతిచేరువలో ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆయనలో ఉన్న పట్టుదల, దీక్ష, దక్షత, పోరాట పటిమ జగన్‌లో ఉన్నాయి. మన కష్టాలు మనమే తీర్చుకునే రోజులు ఆసన్నమయ్యాయి’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement