వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు | ysrcp candidates submitted their nominations | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

Published Wed, Apr 9 2014 11:53 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ysrcp candidates submitted their nominations

 సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్‌లు సమర్పించారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్యగారి ప్రభుగౌడ్ తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్మితా సబర్వాల్‌కు అందజేశారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి మహ్మద్ మొహియొద్దీన్ తన నామినేషన్ పత్రాలను జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శరత్‌కు అందజేశారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మరపడగ శ్రవన్‌కుమార్ గుప్త, గజ్వేల్  అసెంబ్లీ స్థానానికి దొంతి పురుషోత్తంరెడ్డి, అందోల్
 నుంచి బందిరగల్ల సంజీవరావు, నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ దండెపు బస్వానందం, పటాన్‌చెరు అసెంబ్లీ స్థానానికి గురజార శ్రీనివాస్‌గౌడ్, జహీరాబాద్ అసెంబ్లీ స్థానానికి నల్లా సూర్యప్రకాష్‌రావు, సిద్దిపేట అసెంబ్లీ స్థానానిక తడక జగదీశ్వర్, మెదక్ అసెంబ్లీ స్థానానికి అల్లారం క్రీస్తుదాస్, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement