ఫ్యాన్ ప్రభంజనం | ysrcp to sweep elections in seemandhra | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ ప్రభంజనం

Published Tue, May 6 2014 1:01 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ఫ్యాన్ ప్రభంజనం - Sakshi

ఫ్యాన్ ప్రభంజనం

 సాక్షి, ఏలూరు : విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు జిల్లా ఓటర్లు సంసిద్ధులవుతున్నారు. కుట్రలు, కుతంత్రాలను చెండాడుతూ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం శ్రమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కష్టాల్లో.. బాధల్లో అండగా ఉన్న వైఎస్ కుటుంబానికి బాసటగా నిలిచే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మ హానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో దాదాపు 80మంది ప్రాణాలు విడిచారు.
 
 వారి కుటుంబాలను ఓదార్చడానికి ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమైతే కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. ఇచ్చిన మాటకోసం అధిష్టానాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్ ఆ యాత్రకు మన జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబాన్నీ పలకరించి కన్నీరు తుడిచారు. అప్పటినుంచి ప్రతి కష్టంలోనూ అండగా నేనున్నానంటూ ధైర్యమిచ్చా రు. జనం సమస్యలపై పోరాడటంలో తానే ముందు నిలిచారు. వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ సైతం విద్యార్థుల కోసం ఫీజుదీక్షను జిల్లాలోనే చేపట్టారు. ఆయన సోదరి షర్మిల మండుటెండల్లో జిల్లాలో పాదయాత్ర చేశారు.
 
 రెండు నెలలుగా జనం మధ్యనే...
 గడచిన రెండు నెలల్లో వైఎస్ జగన్, విజ యమ్మ, షర్మిల జిల్లాలో విసృ్తతంగా పర్యటించారు. ప్రతి ఒక్కరి కష్టాలూ వింటూ ముందుకు నడిచారు. జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ కుటుంబంపై ప్రజలు చూపుతున్న ప్రేమానురాగాలకు రుణపడి ఉంటామని.. సమస్యలు పరిష్కరిం చడం ద్వారా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వారి పర్యటనలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి. వారి మాటలు తూటాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించారుు. వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల పర్యటనలతో జిల్లాలో వైఎస్సార్ సీపీ అజేయ శక్తిగా మారింది. దీంతో ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని జనం ఎదురుచూస్తుంటే.. ఇతర పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి.
 
 భరోసానిచ్చిన వైఎస్ జగన్
 వైఎస్ జగన్ మార్చి నెలలో రెండుసార్లు జిల్లాకు వచ్చారు. మొదటిసారి మూడు రోజులు, రెండోసారి నాలుగు రోజులు జిల్లాలో పర్యటించారు. మార్చి 3న ఏలూరులో జనభేరి మోగించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. మార్చి 4న నిడదవోలులో జనభేరి సభలో పాల్గొన్నారు. ఆ రోజు మండుతున్న ఎండలోనూ వైఎస్ జగన్ కోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. అదే రోజున గోపాలపురం నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు.
 
 మార్చి 5న చింతలపూడిలో రోడ్ షో చేశారు. రెండో విడతగా మార్చి 14న వైఎస్ జగన్ జిల్లాలో అడుగుపెట్టారు. ఆరోజు సాయంత్రం నరసాపురంలో నిర్వహించిన వైఎస్సార్ జనభేరి సభలో రాజకీయ ఉద్ధండుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ మర్నాడు మార్చి 15న పాలకొల్లు, భీమవరం, ఉండి నియోజకర్గాల్లో జగన్ రోడ్ షో నిర్వహించారు. మార్చి 16న తణుకు, తాడేపల్లిగూడెంలో, మార్చి 17న కొవ్వూరులో రోడ్ షో చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. మూడోవిడతగా ఈ నెల 3న పాలకొల్లు, 4న వట్లూరులో జనభేరి బహిరంగ సభలు నిర్వహించారు. ప్రజల కష్టాలు తొలిగే రోజు త్వరలోనే వస్తుందని భరోసా ఇచ్చారు.
 
 ఆప్యాయత పంచిన విజయమ్మ
 వైఎస్ విజయమ్మ రెండు నెలల్లో రెండుసార్లు జిల్లాకు వచ్చారు. ఏలూరు, రాజ మండ్రి లోక్‌సభ నియోజకర్గాల పరిధిలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటి విడత మార్చి 25న జంగారెడ్డిగూడెంలో జనభేరి సభ జరిపారు.  రెండో విడతగా ఏప్రిల్ 16న చింతలపూడి రోడ్ షో నిర్వహించి, గోపాలపురంలో జనభేరి సభలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ వల్ల మనందరి కష్టాలూ తీరతాయని, మీ అందరినీ తన బిడ్డల్లా చూసుకుంటానంటూ విజయమ్మ ఆప్యాయత పంచారు.     
   
 ధైర్యమిచ్చిన షర్మిల
 షర్మిల రెండు రోజులపాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. చింతల పూడి, పోలవరం, కొవ్వూరు, ఉంగుటూరు, ఆచంట నియోజకవర్గాల్లో జనభేరి మోగించారు. ఈ నెల 2న జంగారెడ్డిగూడెలో రోడ్‌షో నిర్వహించి, కొయ్యలగూడెం, కొవ్వూరులో జనభేరి సభల్లో ప్రసంగించారు. మే 3న నారాయణపురం, మార్టేరులో  జనభేరి మోగించి జగన్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రానుందని ఎలుగెత్తి చాటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement