స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌లు సాయంగా ఉంటాయి | advantages with smart phone applications | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌లు సాయంగా ఉంటాయి

Published Tue, Jul 22 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌లు సాయంగా ఉంటాయి

స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌లు సాయంగా ఉంటాయి

నయా జనరేషన్ అమ్మను ‘చీఫ్ ఫ్యామిలీ ఆఫీసర్’గా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే ఆమెకున్న బాధ్యతలు అలాంటివి. కార్పొరేట్ కంపెనీల సీఈవోలకు తీసిపోని రీతిలో అమ్మకు బాధ్యతలుంటాయి. అందుకే అమ్మను ‘సీఎఫ్‌వో’ అనవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇంటి ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా ఆమెకున్న బాధ్యతలు నెరవేర్చడానికి కొన్ని స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు సాయంగా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. అవేమిటంటే...
 
అవర్ గ్రోసరీస్...
సాయంత్రం ఆఫీసు నుంచి సూపర్‌మార్కెట్ మీదుగా ఇంటికి వచ్చే భర్తకు ఇంట్లోకి కావాల్సిన సరుకుల జాబితాను చాలా తేలికగా చేరవేయడానికి ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఫోన్ చేసి ఆయనను డిస్ట్రబ్‌చేయడానికి బదులుగా.. ఆండ్రాయిడ్ మొబైల్‌లోని ఈ అప్లికేషన్ ద్వారా కావాల్సిన సరుకుల జాబితాను సులభంగా చేరవేయవచ్చు. రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోనూ ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు...కమ్యూనికేషన్‌కు అవకాశం ఉంటుంది. కిరాణా సరుకుల జాబితాను స్మార్ట్‌ఫోన్ ద్వారా చేరవేయచ్చు.
 
షాప్ సేవీ...

షాపింగ్ విషయంలో చాలా సరదా అప్లికేషన్ ఇది. ఉపయుక్తమైన అప్లికేషన్ కూడా. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొన్న స్మార్ట్‌ఫోన్‌లోకి ఏ వస్తువు ధరకు సంబంధించిన బార్‌కోడ్‌ను ఎంటర్ చేసినా... అది డీకోడ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో సదరు వస్తువుకు సంబంధించిన ధరలన్నింటినీ ఈ అప్లికేషన్ అందిస్తుంది. తద్వారా మీరు కొంటున్న మాల్‌లోని ధరతో పోల్చి చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మహిళలకు ఇంతకు మించి మిత్రురాలు ఎవరుంటారు!
 
మమ్ 2 బీ...
గర్భవతి అయ్యాక.. పుట్టబోయే పాప విషయంలోనూ, బాబు విషయంలోనో ఎంతో ఉద్వేగంగా ఎదురుచూసే కాబోయే తల్లులకు ఈ అప్లికేషన్ ఎంతో ఆనందాన్ని పంచుతుంది. గర్భంలోని పాపాయి గురించి... వారాలను బట్టి.. తన బరువు ఎంత ఉంటుంది? ఎంత పొడవు ఉంటుంది? అనే విషయాల గురించి వివరించడంతోపాటు.. అనేక టిప్స్‌ను కూడా తెలియజేస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్.
 
మమ్స్ జీల్...

ఈ అప్లికేషన్ ఒక ఆన్‌లైన్ కమ్యూనిటీ లాంటిది. ఎదుగుతున్న పిల్లలకు సంబంధించిన సమస్యల గురించి, వారి పెంపకం గురించి తల్లులందరూ ఒక చోటకు చేరి చర్చించడానికి అవకాశం ఇస్తుంది ఈ యాప్. సందేహాల గురించి సమాధానం ఇవ్వడానికి నిపుణులుంటారు. అలాగే సమవయస్కులైన మహిళలతో స్నేహం పెంపొందించుకోవడానికి కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement