బకాసుర బిర్యానీ
తిక్క లెక్క
బకాసురుడు బండెడు తిండి తినేవాడట. అతగాడికి బిర్యానీ వడ్డించాలంటే, కనీసం ఈ మాత్రం తయారు చేయాలేమో! ఇంత భారీగా బిర్యానీ ఎందుకు తయారు చేశారంటారా? ఢిల్లీలోని కోహినూర్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు రికార్డు బద్దలు కొట్టాలని సరదా పుట్టింది. ఇకనేం... ఆ కంపెనీకి చెందిన అరవై మంది పాకశాస్త్ర నిపుణులు పచనోత్సాహంతో నడుం బిగించి రంగంలోకి దిగారు.
వాళ్లు గరిటెలు తిప్పగా తిప్పగా ఏకంగా 14,060 టన్నుల బిర్యానీ తయారైంది. ఈ బిర్యానీ కోసం 3 వేల కిలోల బియ్యం, 3650 కిలోల కూరగాయలు, 85 కిలోల మిరపకాయలు, 86 కిలోల ఉప్పు, 1200 లీటర్ల నూనె ఉపయోగించారు.