బద్ధ పద్మాసనం
బద్ధ అనగా బద్ధుడు లేదా బంధింపబడిన అని అర్థం. అంటే మనసు పద్మాసనంలో బంధింపబడి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని బద్ధ పద్మాసనం అంటారు.
ఎలా చేయాలి?
పద్మాసన స్థితిలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచుకుని రెండు చేతులు తొడలమీద ఉంచుకోవాలి.
ఇప్పుడు కుడిచేతిని వెనుకకు మడిచి కుడిచేతి వేళ్లతో ఎడమ తొడ మీద ఉన్న కుడికాలి బొటన వేలిని పట్టుకోవాలి.
అలాగే ఎడమ చేతిని వెనుకకు మడిచి కుడిచేతి మీదుగా ఎడమ చేతి వేళ్లతో కుడి తొడపై ఉన్న ఎడమ కాలి తబొటనవేలిని పట్టుకోవాలి.
ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి యథాస్థితికి రావాలి.
ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు
ఛాతీ విశాలంగా మారుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
పద్మాసనంలో ఉండే ఫలితాలు అన్నీ ఇందులోనూ ఉంటాయి.
భుజాలకు, చేతులకు, మోకాళ్లకు బలం చేకూరుతుంది.
వెన్నెముక నిటారుగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది.
ప్రాణవాయువు చక్కగా ప్రసరించి ధ్యానానికి తోడ్పడుతుంది.
నడుము సన్నబడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఇంద్రియ నిగ్రహం పెరిగి ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
జాగ్రత్తలు
భుజాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు, మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్నవాళ్లు, తొడల మీద కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
మోడల్
ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
హైదరాబాద్