పిల్లల పాన్పులు
పిల్లల గది అనగానే రంగు రంగుల గోడలు, బొమ్మలు, ఆట వస్తువులు... ఇవే కళ్లముందుంటాయి. ఇద్దరు పిల్లలున్న ఇల్లయితే పడుకునే సమయానికి ఇల్లుపీకి పందిరేస్తారు. అలాంటి పిల్లలుంటారనే వారి గదిలో డబుల్‌బెడ్ ప్రత్యక్షమైంది. మంచంపై మరో మంచమన్నమాట.
గదిలో స్పేస్ కలిసి రావాలంటే ఇదొక్కటే మార్గం. పిల్లలు కొట్లాడుకోకుండా ఉండడానికి కూడా ఈ డబుల్‌బెడ్ సాయపడుతుంది. ఏ గొడవా లేకుండా ఎవరి పక్కమీద వారు పడుకోవచ్చు. చదువుకోవాలంటే గది మొత్తం వెలుతురొచ్చే పెద్ద లైటు వేసుకోకుండా పడుకునేవాళ్లు పడుకోవచ్చు. చదువుకునేవాళ్లు వారి బెడ్‌లాంప్ వేసుకుని పక్కవారికి ఇబ్బందిలేకుండా చదువుకోవచ్చు.
పిల్లల మంచం కదా అని లైట్ తీసుకోడానికి లేదు. మంచానికి వాడే వుడ్ దగ్గర నుంచి పై మంచం ఎక్కడానికి ఏర్పాటు చేసే మెట్ల వరకూ బోలెడు క్రియేటివిటీ చూపిస్తున్నారు. మీ పిల్లల అభిరుచికి సూటయ్యే బోలెడు డిజైన్లు మార్కెట్‌లో ఉన్నా...మీకు నచ్చిన డిజైన్‌లో చేయించుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. వీటిలో మీకు ఏది నచ్చుతుందో చూడండి మరి!