
ఇటీవల పది పన్నెండేళ్ల పిల్లలు టీవీలో వచ్చే యాడ్స్ చూసి ఎనర్జీ డ్రింక్స్ ఇప్పించమంటూ తల్లితండ్రుల్ని కోరుతుంటారు. మాల్స్‌కు వెళ్తే అక్కడి ఎనర్జీ డ్రింక్స్ కావాలని మారాం చేస్తుంటారు. ఆరోగ్యానికి అవి అంత మంచివి కావనే చెప్పవచ్చు. వాటిల్లో కెఫిన్ పాళ్లు చాలా ఎక్కువ. ఎంతగా ఎక్కువ అంటే... ఆ ఎనర్జీ డ్రింక్స్ తాలూకు ఇన్‌గ్రేడియెంట్స్‌లో 38.5 ఎమ్‌జీ అనీ, 72 ఎంజీ అనీ రాయడమే కాకుండా... అవి చిన్న పిల్లలకూ, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదంటూ ఆ ఉత్పాదనపై ప్రచురించి మరీ అది మంచిది కాదనే విషయాన్ని వారే చెబుతుంటారు. ఇక వాటి తయారీలో కృత్రిమమైన స్వీటెనర్స్ ఉపయోగిస్తారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ చాలా వేగంగా శరీరానికి శక్తిని ఇస్తాయి. శారీరక కార్యకలాపాలు చేసేందుకు తక్షణ శక్తిని సమకూర్చేందుకు గాను అధికమోతాదుల్లో క్యాలరీలు సమకూరేలా వాటిల్లో చాలా ఎక్కువగా ఈ తరహా చక్కెరలు (షుగర్స్) కలుపుతారు. ఆ కృత్రిమ చక్కెరలు ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే.
అందుకే వాటికి బదులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి– స్వాభావికమైన తాజా పళ్ల రసాలు, కూరగాయల రసాలు (క్యారట్ వంటి వెజిటబుల్ జ్యూసెస్) ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ తరహా స్వాభావికమైన తాజా పండ్లరసాలతో పోలిస్తే ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలేమీ ఉండవు. అందుకే పిల్లలకు తాజా పళ్లరసాలు, మజ్జిగ, లస్సీ, వెజిటబుల్ సూప్స్ వంటివి ఇస్తే మంచిది. ఇక పండ్ల రసాల విషయానికి వస్తే... ఎనిమిది నుంచి టీనేజ్ వయసు పిల్లలు పండ్లను కొరికి తినడం ఇంకా మంచిది. కొరికి తినలేని వారికోసమే జ్యూసెస్. కొబ్బరినీరు, నిమ్మ నీరు వంటి ద్రవపదార్థాలు ఇవ్వడం ఈ సీజన్‌లో పిల్లలకు ఎంతో మేలు చేసే అంశం.
Comments
Please login to add a commentAdd a comment