చార్‌ధామ్ యాత్ర | Chardham trip | Sakshi
Sakshi News home page

చార్‌ధామ్ యాత్ర

Published Sat, Apr 16 2016 11:07 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

చార్‌ధామ్ యాత్ర - Sakshi

చార్‌ధామ్ యాత్ర

జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర.

 

గంగోత్రి, యమునోత్రి,  బద్రీనాథ్,కేదార్‌నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒక్కసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవత లు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన 6 నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో వచ్చే దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ ఏడాది మే 8 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్‌లోనే... గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు దేవాలయాలు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి.

 

యమునోత్రి  మొదటి దర్శనం
చార్‌ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది - సూర్యదేవుడు ఆయన అర్ధాంగి ఛాయాదేవికి యముడు, యమున ఇద్దరు సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట.

 

గంగోత్రి గంగ మొదటగా నేలమీదికి దూకింది ఇక్కడే!
చార్‌ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్ రాష్ర్టంలోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి  3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. భగీరథుడి తపఃఫలంగా ఉద్భవించిన గంగ 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకు దూకుతుంది. గంగ మొదటగా నేల మీదకు దిగింది ఈ చోటనే! గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది.

 

 కేదార్‌నాథ్

నరనారాయణులు తపస్సు చేసిన స్థలం
అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్‌నాథ్. అతి గొప్ప పుణ్యక్షేత్రం. ఇది వైశాఖమాంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారంలో గాని, మే నెల మొదటి వారంలో గానీ తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరు వారంలో లేదా నవంబరు నెల మొదటి వారంలో మూసివేస్తారు. మందాకినీ నది ఒడ్డున వెలసిన ఈ కేదార్‌నాథ్ ఆలయం ప్రాంగణంలో సజీవాకృతిలో ఉన్న బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉంది. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశార ని స్థలపురాణం చెబుతోంది.

 

బద్రీనాథ్  బ్రహ్మకపాలం ఉన్నదే బద్రీనాథ్
జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలూ సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపు నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి, నారదుడు, ఉద్ధవుడు, స్వామి పాదుకలు ఉండగా, కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. తప్తకుండం సమీపంలో ఉన్న నల్లటి శిలను బ్రహ్మకపాలం అంటారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అత్యంత సుందరమైన స్త్రీని సృష్టించి, ఆమె అందానికి మోహితుడయ్యాడట. ఆగ్రహించిన శివుడు బ్రహ్మ శిరస్సును ఖండించగా ఆ శిరస్సు శివుని చేతికి అంటుకుపోయిందట. ఎక్కడా వదలని ఆ శిరస్సు బదరికాశ్రమం చేరగానే ఊడిపోయిందట. అలా, ఇక్కడ కనిపించే శిలనే బ్రహ్మదేవుని కపాలమని స్థలపురాణం చెబుతోంది. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

చార్‌ధామ్ యాత్రలో ఆర్.వి.టూర్స్ - ట్రావెల్స్
ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది ఆర్.వి.టూర్స్ - ట్రావెల్స్ సంస్థ. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చార్‌ధామ్ యాత్ర ఏర్పాటు చేస్తూ యాత్రికుల మన్ననలను పొందుతోంది. హిమాలయ మంచుకొండల్లో సైతం తెలుగువారి భోజన సదుపాయాలతో పాటు వసతి సౌకర్యాలను, యాత్రీకులకు తోడుగా గైడ్స్‌ని ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యులు వెంటలేరన్న లోటును తీరుస్తోంది.

 
అందరికీ అందుబాటులో: ‘‘ఈ ఏడాది (2016) చార్‌ధామ్ యాత్రకు సంబంధించి 14 రోజుల వ్యవధిలో హైదరాబాద్ నుండి ప్రారంభమై తిరిగి హైదరాబాద్‌కు వచ్చేవరకు యాత్రికుల వసతి సౌకర్యాలను చాలా తక్కువ ధరలకే ఏర్పాటు చేశామ’’ని ఆర్.వి.సంస్థ అధినేత ఆర్.వి.రమణ తెలియజేస్తున్నారు. వచ్చే నెల మే 5, 12, 19 - జూన్ 2 తేదీలలో ఆర్.వి.ట్రావెల్స్ వారు ప్రత్యేకంగా చార్‌ధామ్ గ్రూపు ప్యాకేజీలు ఏర్పాటుచేశారు. ‘ఆర్.వి,ట్రావెల్స్ సంస్థ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా చార్‌ధామ్ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు ఆర్.వి.రమణ తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించి తమ యాత్రను ఏర్పాటు చేసుకోవలసిందిగా కోరుతున్నారు.

 వివరాలకు...


చాలా హ్యాపీగా అనిపించింది
నేనో కార్పోరేట్ ఇంజనీర్‌ని. కుటుంబసభ్యులతో కలిసి చార్‌ధామ్ యాత్రకు వెళ్లాను. ఏ తీర్థయాత్రకు వెళ్లినా ఫుడ్ పెద్ద సమస్యగా ఉంటుంది. కానీ, ఆర్.వి.ట్రావెల్స్‌లో ఫుడ్ మా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. అంతదూరం తీసుకెళ్లి ఆంధ్రాఫుడ్ పెట్టమంటే మామూలు విషయం కాదు. గెడైన్స్ బాగా ఇచ్చారు. మళ్లీ అదే ట్రావెల్స్ నుంచి జూన్‌లో అమర్‌నాథ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను. వ్యక్తిగత షాపింగ్‌కు తప్ప మరే ఖర్చు లేదు. చాలా హ్యాపీగా అనిపించింది.

 - విద్యాధర్, గుంటూరు 9553633733

 

ఎన్నో జన్మల పుణ్యఫలం
కిందటేడాది నేనూ నా భార్యా చార్‌ధామ్ యాత్రకు వెళ్లొచ్చాం. ఈ యాత్ర ఎన్నో జన్మల పుణ్యఫలంగా మాత్రమే లభిస్తుందని మాకు తెలిసొచ్చింది. ఆర్.వి.ట్రావెల్స్ అందించిన సదుపాయాల వల్ల యాత్రలో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు.
- మోహన్‌రెడ్డి, హైదరాబాద్ 9515034951

 

సునాయాసంగా చేరుకోగలిగాం
చార్‌ధామ్ కష్టతరమైన యాత్ర. కానీ, ఇప్పటికి మూడు సార్లు వెళ్లొచ్చాను. కిందటి సారి మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి బయల్దేరాం. గంగోత్రి, యమునోత్రి, బదిరానాధ్ రోడ్డు మార్గాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. కానీ, అర్.వి. ట్రావెల్స్ వారి గైడ్‌లైన్స్‌తో  సునాయాసంగా ఈ ప్రాంతాలకు చేరుకోగలిగాం. భోజన, వసతి సదుపాయాలు చాలా బాగున్నాయి.
- ఎమ్. సత్తిరెడ్డి, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ 8978253399

 

ఇబ్బందులు ఎదురుకాలేదు
జీవితంలో తప్పనిసరిగా చూడాల్సిన యాత్ర చార్‌ధామ్. నేను, మా వారు ఈ యాత్రకు వెళ్ళొచ్చాం. దేనికదీ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన భోజన, వసతి సౌకర్యాలు పరిశుభ్రంగా, రుచిగా ఉండటంతోబాటు పద్ధతి ప్రకారం నడుచుకోవడం వల్ల ఎక్కడా ఇబ్బందులు రానివ్వలేదు - శ్రీమతి వెంకటరమణ, నర్సారావుపేట  9676393449

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement