
పొగరాయుళ్లకు డయాబెటిస్ రిస్క్..
పొగతాగని వారితో పోలిస్తే పొగరాయుళ్లకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరడం వల్ల డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు, పక్షవాతం సోకే అవకాశాలు పెరుగుతాయని, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు తలెత్తుతాయని భారత్‌లోని మధుమేహ అధ్యయన సంస్థ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు పొగతాగే అలవాటు మానుకోకుంటే, మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.