నిద్ర సమస్యలతో డయాబెటిస్ ముప్పు!
పరిపరిశోధన
నిద్ర సమస్యలతో డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర మరీ తక్కువైనా ఇబ్బందేనని, మరీ ఎక్కువైనా ఇబ్బందేనని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో పురుషుల కంటే మహిళలకు డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
సగటున రోజుకు ఆరుగంటల నిద్ర అవసరమని, అంతకంటే రెండు గంటలు తక్కువగా గానీ, రెండు గంటలు ఎక్కువగా గానీ నిద్రపోతే టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలు 15 శాతం మేరకు ఎక్కువవుతాయని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని పలువురు మహిళలపై పద్నాలుగేళ్ల పాటు తాము జరిపిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం తేలిందని అంటున్నారు.