ముఖాన్ని కరిగించి చూపే స్కినీ పిక్స్... | Dissolve the face of the ski that picks ... | Sakshi
Sakshi News home page

ముఖాన్ని కరిగించి చూపే స్కినీ పిక్స్...

Published Wed, Apr 9 2014 11:49 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

ముఖాన్ని కరిగించి చూపే స్కినీ పిక్స్... - Sakshi

ముఖాన్ని కరిగించి చూపే స్కినీ పిక్స్...

ముద్దుగా బొద్దుగా ఉన్నవారు కూడా చక్కగా చెక్కినట్లు ఉండే ముఖంతో ఫొటో దిగాలనుకుంటే ఈ అప్లికేషన్ మీ కోసమే. ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీని మరింత సమర్థంగా ఉపయోగించుకుంటూ ఈ ‘స్కినీ అప్లికేషన్’ మీ ముఖంలోని కండలను కొంచెం తగ్గించి చూపుతుందన్నమాట. ఆరోగ్యంగా ఉన్నామని, బరువు తగ్గామన్న అనుభూతి పొందేందుకు ఈ సెల్ఫీ ఆప్ ఉపయోగపడుతుందని డెవలపర్లు అంటున్నారు.

అయితే ఇది గ్రూప్ ఫొటోల్లోని వ్యక్తులందరి ముఖాలను తగ్గించి చూపదు. సింగిల్ ఫొటోలకు మాత్రమే పనికొస్తుందన్నమాట. ప్రస్తుతం ఆపిల్ ఆప్ స్టోర్‌లో కొంచెం రుసుము చెల్లించి డౌన్‌లోడ్ చేసుకోగలిగిన ఈ అప్లికేషన్ త్వరలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలోనూ అందుబాటులోకి రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement