అమ్మవారి రేపటి అలంకారం
శ్రీ లలితాత్రిపురసుందరీదేవి-5
శ్రీ విజయనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పంచమి బుధవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అలంకరిస్తారు. ఇది విశేషమైన అలంకారం.
స్తోత్రం:
శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గ స్థితి లయేశ్వరీం
ఉద్యత్ కోటి రవిప్రఖ్యాం మహాత్రిపురసుందరీ
నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం
పాశాంకుశేక్షు కోదండ ప్రసూన విశిఖాం స్మరేత్
భావం: శ్రీవిద్యా స్వరూపిణి, జగన్మాత, సృష్టి స్థితి లయకారిణి, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ లలితా త్రిపుర సుందరి చేతుల్లో పాశం, అంకుశం, చెరుకువిల్లు, పూలబాణాలతో దర్శనమిస్తుంది. నిత్య సత్యస్వరూపిణి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరికి నమస్కారం.
నైవేద్యం: ఉదయం బాలభోగం పొంగలి, మహానైవేద్యం పులిహోర, కేసరి మొదలైనవి. సాయంత్రం శనగలు.
- డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్