బజ్జీలకూ.. మేఘాలకు లింకేమిటబ్బా? ఇదెలా సాధ్యం?... ఇవేగా మీ డౌట్స్! ఒక్క నిమిషమాగితే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక్క బజ్జీలేమిటి.. నూనెలో వేయించే ప్రతి వంటకంతోనూ నగరాల్లో మేఘాలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు యూరోపియన్ శాస్త్రవేత్తలు. నూనెలో ఉండే ట్రైగిజరైడ్ కొవ్వు పదార్థాలు వాతావరణంలోని కణాల చూట్టూ చేరిపోవడం వల్ల ఇలా జరుగుతోందని వీరు అంటున్నారు. ట్రైగిజరైడ్లు అంటుకోవడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి కణాలు ఎక్కువ తేమను ఆకర్శించగలవని.. ఎక్కువ దూరం ప్రయాణించగలవని.. తద్వారా అవి మేఘాలుగా ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయని అంచనా. ఇళ్లల్లో పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఎలాగైతే సోప్ పౌడర్‌కు మట్టి అంటుకుంటందో.. అలాగన్నమాట.
లండన్ నగరంలో ప్రతిరోజూ వాతావరణంలోకి చేరే అతిసూక్ష్మ కణాల్లో కనీసం పదిశాతం ఇలా బాగా వేయించిన వంటనూనెల నుంచి వెలువడ్డవేనని అందుకే ఈ నగరంపై మేఘాలు ఎక్కువ ఉంటున్నాయని బాత్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అడమ్ స్కైర్స్ అంటున్నారు. అయితే తాము ల్యాబ్‌లో చేసిన పరిశోధనకు, వాస్తవ పరిస్థితికి మధ్య తేడా ఉండవచ్చునని. ఎంత మోతాదులో ట్రైగిజరైడ్ కొవ్వులు విడుదలైతే మేఘాలు ఎక్కువ అవుతాయన్న కచ్చితమైన అంచనాలకు మరిన్ని పరిశోధనలు అవసరమని ఆడమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment