అసలు విషయం... | Gossip | Sakshi
Sakshi News home page

అసలు విషయం...

Jul 1 2015 11:12 PM | Updated on Sep 3 2017 4:41 AM

అసలు విషయం...

అసలు విషయం...

పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టికి అమెరికన్ టీవీ సీరిస్ ‘ది రాయల్స్’ సీజన్-2లో అవకాశం వచ్చింది.

గాసిప్

పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టికి అమెరికన్ టీవీ సీరిస్ ‘ది రాయల్స్’ సీజన్-2లో అవకాశం వచ్చింది. ఈ ఇంటర్నేషనల్ షోలో తన క్యారెక్టర్, స్క్రిప్ట్ శిల్పాకు బాగా నచ్చాయట. ‘‘నాకో మంచి అవకాశం వచ్చింది’’ అని అడిగిన వారికి, అడగని వారికి వరస పెట్టి చెప్పిందట. అయితే ఉన్నట్టుండి  ‘ది రాయల్స్’ అవకాశాన్ని తిరస్కరిస్తున్నట్లు శిల్పా ప్రకటించింది.తన ముద్దుల కొడుకు వియాన్‌కు ఎక్కువ సమయం కేటాయించడం కోసమే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పింది.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు విషయం...

‘ది రాయల్స్’ కోసం నిర్మాతలు శిల్పాను సంప్రదించినప్పుడు, ఆ సీరిస్‌లో చేయడానికి సంతోషంగా ఒప్పుకుందట. తన షెడ్యూల్ ఒకసారి చూసి ‘డేట్స్’ ఇస్తానని నిర్మాతలకు చెప్పిందట. అయితే తన నిర్ణయాన్ని ఒక పట్టాన ప్రకటించకపోవడంతో, నిర్మాతలు ‘‘ఇక శిల్పాను సంప్రదించవద్దు’’ అని గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చారట.

 గతంలో ఒక ‘డ్యాన్స్ రియాలిటీ షో’ విషయంలో శిల్పాకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. ఆ షో నుండి ఆమెను తప్పించి వేరే నటిని ఎంచుకున్నారు. ఏది ఏమైనా... ఇంటర్నేషనల్ రియాల్టీ షో ‘బిగ్ బ్రదర్’ తరువాత చిన్న తెరపై శిల్పాశెట్టికి పెద్దగా కలిసి రావడం లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement